NZ vs BAN: ఏంది సామి ఈ రచ్చ.. 1 బంతికి 7 పరుగులు సమర్పించుకున్నారుగా..

|

Jan 09, 2022 | 1:58 PM

క్రికెట్ లో ఒక్కోసారి జరిగే ఘటనలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. తాజాగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ టీమ్స్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్‌లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

NZ vs BAN: ఏంది సామి ఈ రచ్చ.. 1 బంతికి 7 పరుగులు సమర్పించుకున్నారుగా..
7 Runs For 1 Ball
Follow us on

క్రికెట్ లో ఒక్కోసారి జరిగే ఘటనలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. తాజాగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ టీమ్స్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్‌లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 26 ఓవర్‌లో కేవలం ఒక బాల్ కి 7 రన్స్ బంగ్లాదేశ్‌ ఫీల్డర్లు సమర్పించుకున్నారు. ఎబాడోట్ హొస్సేన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిను విల్‌ యంగ్‌ డిఫెన్స్‌ ఆడేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో బంతి.. బ్యాట్ ఎడ్జ్‌ తీసుకుని, స్లిప్‌లో ఉన్న లిటన్ దాస్ వైపు వెళ్లింది. అయితే అతడు క్యాచ్‌ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. ఇంతలో న్యూజిలాండ్‌ బ్యాటర్లు 3 రన్స్ రాబట్టారు.

అయితే ఫీల్డర్‌ బౌలర్ ఎండ్‌ వైపు త్రో చేయగా బౌలర్ ఆ బౌల్ ను ఆపలేకపోవడంతో ఫోర్‌ బౌండరీకు దూసుకెళ్లింది. దీంతో ఓవర్‌త్రో రూపంలో మరో 4 రన్స్ జమ అయ్యాయి.. అంపైర్‌ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Also Read: Tragedy: రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ గేమ్.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ములు స్పాట్ డెడ్

ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్