Video: ఇదెక్కడి బంతి భయ్యా.. వికెట్ల మధ్య నుంచి వెళ్లినా నాటౌటేనా.. పాక్ మ్యాచ్‌లో షాకింగ్ వీడియో..

|

Feb 11, 2024 | 10:14 AM

Pakistan Viral Video: నిజానికి, 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ స్పిన్ బౌలర్ ముస్తాక్ అహ్మద్ వేసిన బంతి వికెట్ మధ్యలో నుంచి వెళ్లడంతో బెయిల్స్ పడలేదు. అప్పట్లో కూడా ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ సమయంలో, దక్షిణాఫ్రికా తరపున పాట్ సామ్‌కాక్స్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు.

Video: ఇదెక్కడి బంతి భయ్యా.. వికెట్ల మధ్య నుంచి వెళ్లినా నాటౌటేనా.. పాక్ మ్యాచ్‌లో షాకింగ్ వీడియో..
Viral Video
Follow us on

Pakistan Viral Video: బంతి వికెట్‌కు తగిలినా వికెట్లు పడకుండా ఉండే ఈ దృశ్యాన్ని మీరు క్రికెట్ మైదానంలో చాలాసార్లు చూసి ఉంటారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా ఇతర మ్యాచ్‌ల్లో ఇలాంటి ఘటనలు చాలాసార్లు కనిపిస్తున్నాయి. చాలా సార్లు బాల్ బెయిల్‌లను తాకి వాటి గుండా వెళతాయి. అయినా, బెయిల్స్ కంద పడవు. అయితే, ఇటీవల క్రికెట్ మైదానం నుంచి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి, బంతి వికెట్ మధ్యలో నుంచి వెళ్లింది. ఆ తర్వాత కూడా బెయిల్‌లు కిందపడకపోవడం గమనార్హం.

ఓ టెన్నిస్‌ బంతితో జరిగే టోర్నీలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల సూరత్‌లో టెన్నిస్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లోని ఒక మ్యాచ్‌లో, బౌలర్‌పై భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బ్యాట్స్‌మన్ ఆఫ్ స్టంప్ వైపు వచ్చాడు. అయితే, అతను బంతిని మిస్సయ్యాడు. ఈ క్రమంలో బంతి మిడిల్, లెగ్ స్టంప్ మధ్య నుంచి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. బంతి వికెట్ల మధ్య నుంచి వెళ్లిన తర్వాత కూడా వికెట్లు లేదా బెయిల్‌లు కూడా పడలేదు.

క్రికెట్ నిబంధనల ప్రకారం, ఒక బ్యాట్స్‌మెన్ వికెట్లు లేదా బెయిల్స్ కింద పడిపోయినప్పుడు మాత్రమే అవుట్ అవుతాడు. ఇటువంటి పరిస్థితిలో, ఈ టోర్నమెంట్‌లో ఇది జరగలేదు. బ్యాట్స్‌మెన్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఖంగుతిన్నారు. ఇది చూసిన కొందరు అభిమానులకు పాకిస్థాన్ మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ గుర్తుకు వచ్చింది.

వైరలవుతోన్న పాకిస్తాన్ వీడియో..

నిజానికి, 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ స్పిన్ బౌలర్ ముస్తాక్ అహ్మద్ వేసిన బంతి వికెట్ మధ్యలో నుంచి వెళ్లడంతో బెయిల్స్ పడలేదు. అప్పట్లో కూడా ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ సమయంలో, దక్షిణాఫ్రికా తరపున పాట్ సామ్‌కాక్స్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..