0,0,0,0,0,0,0,0.. 35 పరుగులకే ఆలౌట్.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ.. స్కోర్ బోర్డ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!

Cricket ducks record: ఆస్ట్రియా మహిళల క్రికెట్ జట్టు టర్కీతో జరిగిన కాంటినెంటల్ కప్ మ్యాచ్‌లో చరిత్రలో నిలిచిపోయే ఘోర బ్యాటింగ్ పతనాన్ని చవిచూసింది. కేవలం 35 పరుగులకే ఆలౌట్ అవ్వగా, ఎనిమిది మంది బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. టర్కీ బౌలర్ల ధాటికి ఆస్ట్రియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఈ అద్భుత ప్రదర్శనతో టర్కీ మహిళల జట్టు సునాయాసంగా విజయం సాధించింది, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

0,0,0,0,0,0,0,0.. 35 పరుగులకే ఆలౌట్.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ.. స్కోర్ బోర్డ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!
Duck Out In Cricket

Updated on: Aug 27, 2026 | 12:48 PM

Cricket Ducks Record: క్రికెట్‌లో ఒక్కోసారి ఊహించని రీతిలో బ్యాటింగ్ పతనాలు కనిపిస్తుంటాయి. కానీ ఆస్ట్రియా మహిళల జట్టు ప్రదర్శన మాత్రం వాటన్నింటినీ మించిపోయింది. మహిళల కాంటినెంటల్ క్రికెట్ కప్‌ 2026 తొలి మ్యాచ్‌లో టర్కీ మహిళల జట్టు ముందు ఆస్ట్రియా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. దీంతో ఆస్ట్రియా 8.1 ఓవర్లలో కేవలం 35 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టర్కీ 5.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

టర్కీ బౌలర్ల దెబ్బకు విలవిల..

టాస్ గెలిచిన టర్కీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం ఎంత సరైనదో మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే తేలిపోయింది. టర్కీ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆస్ట్రియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

ఇవి కూడా చదవండి

హాసెర్ సెలిక్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. టర్కీ కెప్టెన్ కుబ్రా కనావార్సి కూడా తన రెండు ఓవర్లలో ఒక మెయిడిన్‌తో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించారు. ఎజ్గి నూర్ కిలిక్‌కు ఒక వికెట్ దక్కగా.. మరో ఇద్దరు ఆస్ట్రియా బ్యాటర్లు రనౌట్ అయ్యారు.

8 మంది ఖాతా తెరవలేదు!

ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేదు. కెప్టెన్ ప్రియా సాబు, ఆశి చోప్లా, మల్లికా పథిరన్నెహెలాగే, ప్రవిత గణేశన్, వేరా పొగ్లిట్ష్, ప్రితా గణేశన్, అంజుమన్ హీరా డకౌట్‌గా వెనుదిరిగారు. అష్మాన్ సైఫీ కూడా నాటౌట్‌గా సున్నాకే నిలిచారు.

ఆస్ట్రియా తరఫున కొమటి రెడ్డి చేసిన 8 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. షీతల్ భరద్వాజ్ 5, హాదియా సిద్ధిఖీ 3 పరుగులు చేశారు. మొత్తం ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల కంటే ఎక్స్‌ట్రాల నుంచే ఎక్కువ పరుగులు రావడం మరో విశేషం. ఆస్ట్రియాకు 19 ఎక్స్‌ట్రాలు లభించాయి.

35 పరుగులకే చాపచుట్టేసింది..

టర్కీ బౌలర్ల విజృంభణతో ఆస్ట్రియా ఇన్నింగ్స్ 8.1 ఓవర్లలోనే ముగిసింది. స్కోరు బోర్డుపై కేవలం 35 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఒక్క బౌండరీ కూడా లేకుండానే ఆస్ట్రియా ఇన్నింగ్స్ ముగియడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతోంది.

టర్కీకి స్వల్ప లక్ష్యం.. అయినా రెండు వికెట్లు!

35 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టర్కీకి కూడా ఆరంభంలో చిన్న ఎదురుదెబ్బ తగిలింది. కుబ్రా కనావార్సి డకౌట్ కాగా.. సుజన్ తురాన్ 9 పరుగుల వద్ద ఔటయ్యారు.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

అయితే ఆ తర్వాత జెహ్రా ఎండర్, మెలికె బైరామ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జెహ్రా 12 బంతుల్లో 13 పరుగులు చేయగా.. మెలికె కేవలం 8 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో టర్కీ 5.3 ఓవర్లలోనే 40/2కు చేరుకుని 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

మ్యాచ్ మొత్తంలో 13.4 ఓవర్లే!

ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి పూర్తిగా 13.4 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోయింది. ఆస్ట్రియా 8.1 ఓవర్లు ఆడగా.. టర్కీ లక్ష్యాన్ని 5.3 ఓవర్లలోనే అందుకుంది. అంటే 80 బంతుల లోపే మ్యాచ్‌ ఫలితం తేలిపోయింది.

బౌలర్ల ఆధిపత్యం.. బ్యాటర్ల వైఫల్యం..

మహిళల కాంటినెంటల్ క్రికెట్ కప్‌ తొలి మ్యాచ్‌లో టర్కీ బౌలర్లు చూపించిన ఆధిపత్యం ఆ జట్టుకు ఘన విజయాన్ని అందించింది. మరోవైపు ఆస్ట్రియా బ్యాటింగ్ మాత్రం పూర్తిగా విఫలమైంది. 8 డకౌట్లు.. 35 పరుగుల ఆలౌట్.. 5.3 ఓవర్లలోనే టర్కీ ఛేదన—ఈ మ్యాచ్ స్కోర్‌కార్డు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us