
సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జనవరి 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో గులాబీ రంగు క్యాప్‌లను ప్లేయర్లు పెట్టుకుంటూ ఉంటారు.

కొత్త సంవత్సరం ప్రారంభంలో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్‌ను పింక్ టెస్ట్ అంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు పింక్ క్యాప్‌లు ధరిస్తారు. రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, దానితో పోరాడుతున్న వారికి ధైర్యాన్ని అందించడం దీని లక్ష్యం.

ఈ ప్రచారాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రారంభించారు. మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత, గ్లెన్ మెక్‌గ్రాత్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి సహాయం అందించారు.

సిడ్నీ క్రికెట్ కూడా ప్రతి సంవత్సరం పింక్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించడం ద్వారా ప్రచారానికి మద్దతు ఇస్తుంది. ఈ మ్యాచ్ కోసం సిడ్నీ స్టేడియం గ్యాలరీలను గులాబీ రంగులో అలంకరించనున్నారు. అలాగే, సిడ్నీ టెస్ట్ మూడో రోజున, లేడీస్ స్టాండ్‌కి తాత్కాలికంగా జేన్ మెక్‌గ్రాత్ స్టాండ్ అని పేరు పెట్టారు.

ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు ధరించిన పింక్ క్యాప్‌లను కూడా వేలం వేయనున్నారు. వచ్చే ఆదాయం రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించబడుతుంది.