ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఏడోసారి గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్(WWC Final 2022)లో ఆస్ట్రేలియా ఏకపక్షంగా 71 పరుగుల తేడాతో ఇంగ్లండ్(AUS vs ENG)ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఓపెనర్ అలిస్సా హీలీ 138 బంతుల్లో 170 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హీలీ ఎంపికైంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభం లభించింది. 160 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ పడిపోయింది. రాచెల్ హేన్స్ 93 బంతుల్లో 68 పరుగులు చేసి ఔట్ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా 316 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 138 బంతుల్లో 170 పరుగులు చేసి అలిస్సా హీలీ ఔటైంది. ఆమె ఇన్నింగ్స్‌లో 26 ఫోర్లు బాదింది. హేన్స్, హీలీ, తర్వాత బెత్ మూడీ 47 బంతుల్లో 62 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్స్ పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ తరపున అన్యా ష్రూబ్‌సోల్ 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 48వ ఓవర్‌లో రెండో బంతికి మాగ్ లెన్నింగ్‌ను, మూడో బంతికి బెత్ మూనీని అవుట్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. కానీ చాలా ఆలస్యం కావడంతో ఆస్ట్రేలియా స్కోరు 300 దాటింది.
ఇంగ్లండ్ పేలవ ఆరంభం..
ఇంగ్లండ్ ఆరంభం బాగోలేదు. మూడో ఓవర్‌లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని అందుకుంది. సెమీ ఫైనల్లో సెంచరీ చేసిన డేనియల్ వెయిట్ 4 పరుగులు చేసి బౌల్డ్ అయింది. మేగన్ షట్ తన వికెట్ తీసింది. ఓ వైపు నటాలీ సీవర్ ఇన్నింగ్స్ నిలబెట్టుకున్నా.. మరోవైపు ఆమెకు ఎలాంటి మద్దతు లభించలేదు. చివరి వరకు 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొత్తం 285 పరుగులకే కుప్పకూలింది.
ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరు..
ఆస్ట్రేలియా టీం 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మహిళల ప్రపంచ కప్‌లో ఏదైనా ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఒక జట్టు 300కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. మునుపటి రికార్డు 259/7గా ఉంది. 2013లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఈ స్కోరు సాధించింది.
ప్రపంచ కప్ ఫైనల్‌లో హీలీ భారీ ఇన్నింగ్స్..
అదే విధంగా ఆస్ట్రేలియా స్కోరు ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరుగా నిలిచింది. అదే విధంగా అలిస్సా హీలీ 170 పరుగుల ఇన్నింగ్స్ మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్‌గా నిరూపణ అయింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా ప్లేయర్ కీరన్ రోల్టన్ పేరిట ఉంది. 2005లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో రోల్టన్ 107 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. మహిళల, పురుషుల ప్రపంచకప్ ఫైనల్స్‌లో హీలీ ఇన్నింగ్స్‌లు కలిపి అతిపెద్ద ఇన్నింగ్స్‌గా మారాయి. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉంది. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్ 149 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే మహిళల ప్రపంచ కప్‌లో 7 ట్రోఫీలు గెలచుకుని, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్ నాలుగుసార్లు, న్యూజిలాండ్ ఒకసారి టైటిల్ గెలుచుకున్నాయి. భారత జట్టు రెండుసార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది.
WORLD CUP WINNERS!! ?
YOU BEAUTYYYYY AUSSIES!#CWC22 #TeamAustralia pic.twitter.com/PfboVgeeUy
— Australian Women’s Cricket Team ? (@AusWomenCricket) April 3, 2022
Also Read: Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త.. జట్టులో చేరనున్న దీపక్ చాహర్..