Video: లక్ అంటే నీదే అక్కో.. ఒకే బంతికి సిక్సర్, హిట్ వికెట్‌గా ఔట్.. కట్‌చేస్తే.. నాటౌట్‌గా తేల్చిన అంపైర్..

Alana King Hit Wicket on No Ball: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన మూడవ ODI మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఎలానా కింగ్ కేవలం 12 బంతుల్లో 17 పరుగులు చేసింది. అయితే ఆమె చిన్న ఇన్నింగ్స్ చాలా ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా పేసర్ మసాబటా క్లాస్‌ బౌలింగ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ వీడియో వైరలవుతోంది.

Video: లక్ అంటే నీదే అక్కో.. ఒకే బంతికి సిక్సర్, హిట్ వికెట్‌గా ఔట్.. కట్‌చేస్తే.. నాటౌట్‌గా తేల్చిన అంపైర్..
Alana King Six Hit Wicket N

Updated on: Feb 11, 2024 | 12:02 PM

Alana King Hit Wicket on No Ball: క్రికెట్‌లో ‘లక్’ పాత్ర చాలా కీలకంగా పనిచేస్తుంది. అదృష్టం బాగుంటే, ఆటగాడు తప్పులు చేసినా.. ఔట్ కాడు. ఒక్కోసారి తన తప్పు లేకపోయినా ఔటై పెవిలియన్ చేరుతుంటారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ కింగ్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె కొన్ని సెకన్ల వ్యవధిలో ఒకే బంతికి ‘దురదృష్టం’, ‘అదృష్టం’ చవి చూసింది. ఈ వీడియో చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.

ఫిబ్రవరి 10వ తేదీ శనివారం నార్త్ సిడ్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అందుకు లెగ్ స్పిన్నర్ ఎలానా కింగ్ కూడా లోయర్ ఆర్డర్‌లో వచ్చి 12 బంతుల్లో 17 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో, ఎలానా 2 అద్భుతమైన సిక్సర్లు కొట్టింది. అయితే, ఈ సమయంలో ఒక ఫన్నీ సన్నివేశం కూడా కనిపించింది.

సిక్సర్ కొట్టినా, స్టంప్‌కి తాకిన బ్యాట్..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48వ ఓవర్లో దక్షిణాఫ్రికా పేసర్ మసబాటా క్లాస్ బౌలింగ్ చేసింది. ఎలనా తన ఓవర్ చివరి బంతికి స్ట్రైక్‌లో ఉంది. క్లాస్ వేసిన బంతి ఫుల్ టాస్ కాగా ఎలానా దానిని డీప్ స్క్వేర్ లెగ్ వైపు సిక్స్ కొట్టింది. అయితే, ఆమె సిక్సర్ కొట్టే ప్రయత్నంలో తడబడింది. బంతి బౌండరీ దాటుతున్నప్పుడు, ఎలనా బ్యాట్‌ స్టంప్‌కు బలంగా తగిలింది.

భారీ ట్విస్ట్..

ఎలానా హిట్‌ వికెట్‌గా ఔటైంది. ఆమె తన అదృష్టాన్ని నమ్మలేకపోయింది. 6 పరుగులకే హిట్ వికెట్‌గా ఔటైనందుకు బాధపడింది. అయితే, స్క్వేర్ లెగ్ అంపైర్ నో-బాల్ ఇవ్వడంతో ఎలనాతో సహా అందరూ వెంటనే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బంతి ఎలానా నడుము ఎత్తులో వచ్చింది.

ఈ విధంగా ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ 6 పరుగులు చేయడమే కాదు.. ఏకంగా లైఫ్ దక్కింది. అయితే, మరుసటి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఎలానా మరో సిక్స్ బాదింది. దీంతో బౌలర్ మసాబాటా క్లాస్‌కు మరింత బాధ పెంచింది. అయితే, క్లాస్‌కి కొంత న్యాయం జరగడంతో ఆమె 50వ ఓవర్ తొలి బంతికి ఎలానా కింగ్‌ను అవుట్ చేసింది. ఈ మ్యాచ్ క్లాస్‌కి మంచిదని నిరూపితమైంది. 9 ఓవర్లలో 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..