Ashes Series 2023: యాషెస్‌లో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. టాప్ 5లో ఎవరున్నారంటే?

| Edited By: Ravi Kiran

Jun 16, 2023 | 9:00 AM

Ashes Series 2023: యాషెస్ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లిస్టులో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Ashes Series 2023: యాషెస్‌లో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. టాప్ 5లో ఎవరున్నారంటే?
Ashes 2023
Follow us on

డబ్ల్యూటీసీ 2023 తర్వాత ప్రస్తుతం అందరి చూపు యాషెస్ సిరీస్ 2023పైనే నిలిచింది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 16 నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి, ఫుల్ జోష్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐర్లాండ్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించింది. అందువల్ల ఈ రెండు జట్లు ఒకదానికొకటి పోటీ పడటం ఆసక్తిగా మారింది. యాషెస్ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లిస్టులో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఎన్నోసార్లు ఈ సిరీస్‌లో పోటీ పడ్డాయి. అయితే అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన 4గురు బౌలర్లు ఉన్నారు. ఈ లిస్టులో దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్ 36 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. 11 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ రెండో స్థానంలో నిలిచాడు. 30 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గ్రాత్ 157 వికెట్లు పడగొట్టాడు. హ్యూ ట్రంబుల్ 3వ స్థానంలో నిలిచాడు. 141 వికెట్లు తన ఖాతాలో చేర్చుకున్నాడు. మొదటి ఐదు స్థానాల్లో ఉన్న ఏకైక ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్. 35 మ్యాచ్‌లు ఆడి 131 వికెట్లు పడగొట్టాడు. డెన్నిస్ లిల్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. 128 వికెట్లు తీశాడు.

గత యాషెస్ సిరీస్‌లో గణాంకాలు చూస్తే.. ఆస్ట్రేలియా విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌ టీంను 4-0తో ఓడించింది. ఈసారి ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జూన్ 16 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ఆ తర్వాత 2వ మ్యాచ్ జూన్ 28 నుంచి లండన్‌లో జరగనుంది. మూడో మ్యాచ్‌ జులై 6 నుంచి లీడ్స్‌లో జరగనుంది. నాలుగో మ్యాచ్‌ జులై 19 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది. అదే సమయంలో, సిరీస్‌లోని చివరి మ్యాచ్ జులై 27 నుంచి జులై 31 వరకు లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది. ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..