Ind vs Aus: ఆసీస్‌కి ఆ టీమిండియా ప్లేయర్ అంటే దడ..ఎలాగైనా ఔట్ చేయాలని పెద్ద స్కెచ్..!

|

Nov 16, 2024 | 4:32 PM

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్లాన్ వేశారు. విరాట్ గురించి ఆసీస్ ప్లేయర్లు ఏం అనుకుంటున్నారో తెలుసా?

Ind vs Aus: ఆసీస్‌కి ఆ టీమిండియా ప్లేయర్ అంటే దడ..ఎలాగైనా ఔట్ చేయాలని పెద్ద స్కెచ్..!
Australia Players Making Plan To Stop Virat Kohli In Border Gavaskar Trophy
Follow us on

టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు వరుసగా మూడోసారి ఆస్ట్రేలియా గడ్డకు చేరుకుంది. ఇందుకోసం ఆటగాళ్లు పెర్త్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా కూడా ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. అతను గత 10 ఇన్నింగ్స్‌ల్లో 20 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఇది ఇలా ఉంటే పెర్త్‌లో ప్రారంభమయ్యే మ్యాచ్‌కు ముందు కోహ్లీ ప్రత్యర్థి జట్టులో చర్చనీయాంశంగా మారాడు. కంగారూ టీమ్ అతడిని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. గతంలో విరాట్ ఆస్ట్రేలియాలో చేసిన అద్భుతమైన ప్రదర్శనే దీనికి కారణం. అందుకే విరాట్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొన్ని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. కానీ విరాట్‌కు నచ్చిన ప్రదేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. కోహ్లీకి ఇక్కడ మంచి రికార్డే ఉంది. ఆస్ట్రేలియాలో 13 మ్యాచ్‌ల్లో 54.08 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. దీంతో విరాట్‌ను మిచెల్ మార్ష్ త్వరలో అవుట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పెర్త్ టెస్టుకు ముందు మార్ష్ మాట్లాడుతూ.. 30 పరుగుల వరకు కోహ్లి నాటౌట్ అయితే.. అతడి వికెట్ కోల్పోయేలా భుజంపై కొట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అతని సహచరుడు మార్నస్ లాబుస్చాగ్నే వేరే ప్లాన్ చెప్పాడు. విరాట్‌ను భారీ స్కోరు చేయకుండా ఆపాలంటే అతడిని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్లి తన ఆటను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అతనికి ఆడే అవకాశం ఇస్తే, అతను చాలా ప్రమాదకరమైన ఆటగాడు అవుతాడని చెప్పుకొచ్చాడు.

ఎందుకో తెలియదు టీమిండియాలో విరాట్ కోహ్లీ ప్రమాదకర ప్లేయర్ అని ఆస్ట్రేలియా ఆటగాళ్లు నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంగా ఆసీస్ ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. విరాట్ మునుపటిలా ప్రమాదకరం కాదని, కోహ్లి ఇప్పుడు మారిపోయాడని, అతనిని ఎగతాళి చేయవచ్చని పేర్కొన్నాడు. అయినప్పటికీ రన్స్ విషయంలో విరాట్‌ను తక్కువ అంచనా వేయలేమని చెప్పుకొచ్చాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఈ విషయంపై స్పందించాడు. విరాట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయనని, అతనితో బౌలింగ్‌తోనే మాట్లాడతానని తెలిపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి