Brian Lara Record: లారా 400 పరుగుల ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టేది ఆయనే: ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్

Australia Opener: వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా 4 భారీ సిక్సర్లు, 43 ఫోర్లతో అజేయంగా 400 పరుగులు చేశాడు. అయితే, ఈ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అయితే, తాజాగా ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ జోస్యం చెప్పాడు.

Brian Lara Record: లారా 400 పరుగుల ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టేది ఆయనే: ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్
Steve Smith Can Break Brian

Updated on: Jan 09, 2024 | 5:35 PM

Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)టెస్టు, వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఓపెనర్‌గా ఎవరు వస్తారనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు స్టీవ్ స్మిత్ (Steve Smith) ఇప్పటికే సమాధానం ఇచ్చాడు. కొత్త బాధ్యతతో ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్టీవ్ స్మిత్ తెలిపాడు. అందువల్ల స్మిత్ ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ క్రికెట్‌ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ను ఓపెనర్ గా ఆడించడం మంచిదని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. స్మిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అందువల్ల అతడు ఇన్నింగ్స్ ప్రారంభిస్తే జట్టుకు మరింత మేలు జరుగుతుందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

‘స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే, కేవలం 12 నెలల్లోనే నెం.1 ఓపెనర్ అవుతాడని భావిస్తున్నాను. దాని గురించి సందేహం లేదు. ఎందుకంటే, స్మిత్ 3వ స్థానంలో ఆడిన ఆటగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఏ క్రమంలోనైనా ఆడవచ్చు. స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తే ఒక్క ఏడాదిలోనే నంబర్ 1 ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అవుతాడు’ అంటూ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

400 పరుగుల ప్రపంచ రికార్డును బ్రేక్ చేసేస్తాడు..

స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా వస్తే బ్రియాన్ లారా పేరిట ఉన్న 400 పరుగుల రికార్డును కూడా బద్దలు కొట్టగలడు. ఎందుకంటే, స్మిత్ రోజంతా బ్యాటింగ్ చేయగల ఆటగాడు. అందుకే, టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా మైదానంలోకి దిగితే 400 పరుగుల రికార్డును అధిగమించినా ఆశ్చర్యపోనవసరం లేదని మైకేల్ క్లార్క్ తెలిపాడు.

లారా పేరిట ప్రపంచ రికార్డ్..

వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా 4 భారీ సిక్సర్లు, 43 ఫోర్లతో అజేయంగా 400 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ చెలరేగితే బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డు బద్దలవుతుందని మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..