AUS vs SCO: స్కాట్లాండ్ దెబ్బకు ‘కంగారు’ ఎత్తిపోయిన బౌలర్లు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్..

Australia vs Scotland, 35th Match, Group B, ICC Mens T20 World Cup 2024: తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. స్కాట్లాండ్ తరపున బ్రాండన్ మెక్‌ముల్లెన్ 60, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 42 నాటౌట్, జార్జ్ మున్సే 35, మాథ్యూ క్రాస్ 18 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తరపున గ్లెన్ మాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అష్టన్ అగర్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.

AUS vs SCO: స్కాట్లాండ్ దెబ్బకు కంగారు ఎత్తిపోయిన బౌలర్లు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్..
Australia Vs Scotland

Updated on: Jun 16, 2024 | 8:09 AM

Australia vs Scotland, 35th Match, Group B, ICC Mens T20 World Cup 2024: ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2024లో భాగంగా 35వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు స్కాట్లాండ్ 181 పరుగుల లక్ష్యాన్ని అందించింది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. స్కాట్లాండ్ తరపున బ్రాండన్ మెక్‌ముల్లెన్ 60, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 42 నాటౌట్, జార్జ్ మున్సే 35, మాథ్యూ క్రాస్ 18 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తరపున గ్లెన్ మాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అష్టన్ అగర్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), జార్జ్ మున్సే, చార్లీ టియర్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, క్రిస్టోఫర్ సోల్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్ వీల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..