IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం?

|

Mar 28, 2022 | 3:29 PM

ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఎంట్రీ చేసింది. తొలి మ్యాచ్‌లో గెలుపుతో సంబురాలు చేసుకుంటున్న ఢిల్లీ టీంకు పాకిస్తాన్ నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చింది.

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం?
Mitchell Marsh
Follow us on

ఐపీఎల్ 15వ(IPL 2022) సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌లో విజయంతో అరంగేట్రం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌(DC vs MI)పై విజయం సాధించింది. అదే సమయంలో ఈ విజయం తర్వాత పాకిస్తాన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. పాకిస్తాన్‌లో పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) గాయపడ్డాడు. వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా అతడు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మార్ష్ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడడంపై సందేహం నెలకొంది. అయితే, దీనిపై ఫ్రాంచైజీ లేదా మార్ష్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

తుంటి గాయంతో ఇబ్బంది..

మార్ష్‌కు తుంటి గాయమైంది. మిచెల్ మార్ష్‌కు తుంటి గాయం తగిలిందని, అతని పరిస్థితిని చూస్తుంటే పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లలో అతను ఆడలేడని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఓ ప్రకటనలో తెలిపాడు.

రూ. 6.50 కోట్లకు మార్ష్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..

మిచెల్ మార్ష్‌ను ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.50 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్ష్ గాయంతో ఇబ్బంది పడుతుండడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రాబోయే మ్యాచ్‌ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది.

గాయాలతో పోరాటం..

మార్ష్ గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. 2017లో కూడా గాయపడి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఆ సమయంలో పుణె సూపర్‌జెయింట్స్‌ జట్టులో ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో ఈ ఆటగాడి భుజం, చీలమండకు కూడా శస్త్రచికిత్స జరిగింది. 2020లో ఆర్‌సీబీ జట్టులోకి వచ్చిన మార్ష్ అప్పటికే మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

బిగ్ బాష్‌లో అద్భుత ప్రదర్శన..

ఇటీవల మిచెల్ మార్ష్ బిగ్ బాష్ లీగ్‌లో 85కి పైగా సగటుతో 255 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో మార్ష్ 60కి పైగా సగటుతో 185 పరుగులు చేశాడు.

Also Read: కేవలం 8 బంతులు.. 312 స్ట్రైక్‌రేట్‌‌తో మ్యాచ్ ఫలితానే మార్చిన తుఫాన్ ఇన్నింగ్స్.. బిత్తర పోయిన బౌలర్లు..

IPL 2022: రోహిత్ శర్మకు వరుస షాక్‌లు.. ఇదే రిపీటైతే వేటు పడే అవకాశం?