AUS vs IND: కోహ్లీకి ఏమైంది? లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసిన విరాట్.. బుమ్రా రియాక్షన్ ఏంటంటే? వీడియో

|

Nov 22, 2024 | 6:26 PM

పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది . నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని చెప్పాలి. భారత జట్టు మొత్తం 150 పరుగులకే ఆలౌటైంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో భారత బౌలర్లు చెలరేగారు. అయితే కింగ్ కోహ్లీ మాత్రం అటు బ్యాటింగ్ లోనూ, ఇటు ఫీల్డింగ్ లోనూ బాగా నిరాశపరిచాడు.

AUS vs IND: కోహ్లీకి ఏమైంది? లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసిన విరాట్.. బుమ్రా రియాక్షన్ ఏంటంటే? వీడియో
Virat Kohli
Follow us on

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు నాటకీయ మలుపులు తిరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత జట్టు కేవలం 150 పరుగులకే కుప్పకూలింది.
దీంతో తొలిరోజే మ్యాచ్ ఓడిపోయిందని భారత క్రీడాభిమానులు నిరాశచెందారు. అయితే టీమిండియా బౌలర్ తమ అద్భుత ప్రదర్శనతో భారత్ ను మళ్లీ పోటీలో నిలిపారు. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు ఆస్ట్రేలియా వెన్ను విరిచారు. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ లు కెప్టెన్ కు తమ వంతు సహాకారం అందించారు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అభిమానులను బాగా నిరాశపర్చింది. నిజానికి ఈ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ తొలి మ్యాచ్‌లో రన్ మెషిన్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 12 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లీనే కాదు అందరూ బ్యాటర్లు నిరాశపర్చారులే అనుకోవచ్చు. కానీ ఫీల్డింగ్‌లోనూ ఘోర తప్పిదం చేశాడు కింగ్ కోహ్లీ.

జస్ప్రీత్ బుమ్రా జట్టు రెండో ఓవర్ మూడో బంతికి నాథన్ మెక్‌స్వీనీని అవుట్ చేశాడు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ రంగంలోకి దిగాడు. అదే ఓవర్ ఐదో బంతికి లబుషేన్ కూడా ఔటయ్యేవాడే. బంతి అతని బ్యాట్ ఎడ్జ్ కు తగిలి నేరుగా
విరాట్ కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. సెకండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ క్యాచ్‌ని సులువుగా తీసుకున్నాడని అనిపించడంతో తోటి ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం కూడా మొదలు పెట్టారు. అయితే కోహ్లి క్యాచ్‌ జారవిడిచాడని తెలుసుకుని అందరూ నిరాశకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇక మార్నస్ లబుషేన్ క్రీజులో పాతుకుపోయినప్పటికీ మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నాయి. ఉస్మాన్ ఖవాజా తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, స్టీవ్ స్మిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. హర్షిత్ రాణా తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రావిస్ హెడ్ ను బోల్తా కొట్టించాడు. అతని తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ కూడా 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు మార్నస్ లబుషేన్ మాత్రం క్రీజులో పాతుకుపోయారు. అయితే చివరకు 52 బంతుల్లో 2 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.