Asif Afridi : టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. రిటైర్ అయ్యే వయసులో డెబ్యూ.. ఏదైనా మీకే చెల్లుతుంది రా అయ్యా !

పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య రావల్పిండిలో జరుగుతున్న రెండవ టెస్ట్‌లో ఆసిఫ్ అఫ్రిది డెబ్యూ ఇచ్చాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. అతను విరాట్ కోహ్లీ కంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్ కెరీర్లో ఎన్నో మైలు రాళ్లను దాటిన తర్వాత రిటైర్‌మెంట్ కూడా తీసుకున్నాడు.

Asif Afridi : టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. రిటైర్ అయ్యే వయసులో డెబ్యూ.. ఏదైనా మీకే చెల్లుతుంది రా అయ్యా !
Asif Afridi

Updated on: Oct 20, 2025 | 2:54 PM

Asif Afridi : పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య రావల్పిండిలో జరుగుతున్న రెండవ టెస్ట్‌లో ఆసిఫ్ అఫ్రిది డెబ్యూ ఇచ్చాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. అతను విరాట్ కోహ్లీ కంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్ కెరీర్లో ఎన్నో మైలు రాళ్లను దాటిన తర్వాత రిటైర్‌మెంట్ కూడా తీసుకున్నాడు. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను డ్రాగా ముగించాలంటే సౌతాఫ్రికా ఈ టెస్ట్‌ను ఎలాగైనా గెలవాలి.

పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టెస్ట్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ అఫ్రిది డెబ్యూ చేశాడు, ఇది ముందే ఊహించినదే. అతను పాకిస్తాన్ తరఫున టెస్ట్‌లో డెబ్యూ చేసిన రెండో అత్యంత వయస్కుడైన ఆటగాడు. టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ తరఫున అత్యంత ఎక్కువ వయస్సులో డెబ్యూ చేసిన ఆటగాడు మీరాన్ బక్ష్. అతను 1955లో టీమిండియాపై డెబ్యూ చేశాడు. ఆ సమయంలో అతని వయస్సు 47 సంవత్సరాల 284 రోజులు.

ఆసిఫ్ అఫ్రిది అక్టోబర్ 20, 2025న టెస్ట్ డెబ్యూ చేశాడు. ఈ సమయంలో అతని వయస్సు 38 సంవత్సరాల 299 రోజులు. డిసెంబర్‌లో అతనికి 39 సంవత్సరాలు నిండుతాయి. ఈ వయస్సులో చాలా మంది ఆటగాళ్లు తమ కెరీర్‌ను ముగిస్తారు కాబట్టి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసిఫ్ డిసెంబర్ 25, 1986న పెషావర్‎లో జన్మించాడు. అతను బౌలింగ్ ఆల్ రౌండర్. అతను 57 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 198 వికెట్లు తీశాడు, 13 సార్లు ఫైవ్ వికెట్ హాల్స్ సాధించాడు. 2 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో అన్ని 10 వికెట్లు పడగొట్టాడు. అదనంగా, అతను 60 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 83 వికెట్లు తీశాడు. అతని ఆలస్య డెబ్యూ అతని సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రతిబింబిస్తుంది.

పాకిస్తాన్ ప్లేయింగ్ 11 : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అగా సల్మాన్, నౌమాన్ అలీ, సాజిద్ ఖాన్, షహీన్ షా అఫ్రిది, ఆసిఫ్ అఫ్రిది.

5. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 : ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్), సెనురాన్ మతుసామి, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..