Asia Cup 2025 : రెండు మ్యాచులు గెలిచినా.. ఇంకా డౌటేనా? టీమిండియా సూపర్-4లో ఉంటుందా? లేదా?

ఆసియా కప్ 2025లో సూపర్-4 దశ కోసం పరిస్థితి నెమ్మదిగా స్పష్టమవుతోంది. పాయింట్స్ టేబుల్‌ను చూస్తే, గ్రూప్-ఎలో భారత్, గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఏ జట్టు కూడా సూపర్-4లో తమ స్థానాన్ని అధికారికంగా ఖాయం చేసుకోలేదు.

Asia Cup 2025 : రెండు మ్యాచులు గెలిచినా.. ఇంకా డౌటేనా? టీమిండియా సూపర్-4లో ఉంటుందా? లేదా?
Asia Cup 2025 India

Updated on: Sep 15, 2025 | 6:27 PM

Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో గ్రూప్ దశ మ్యాచ్‌లు మెల్లమెల్లగా ముగుస్తున్నాయి. పాయింట్స్ టేబుల్‌ను చూస్తే గ్రూప్-ఎలో భారత్, గ్రూప్-బిలో అఫ్ఘానిస్తాన్ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా సూపర్-4లో తమ స్థానాన్ని ఖరారు చేసుకోలేదు. భారత జట్టు యూఏఈ, పాకిస్తాన్‌లను భారీ తేడాతో ఓడించింది. అయినప్పటికీ టీమిండియా ఇంకా టోర్నమెంట్ నుండి బయటపడే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీమిండియా టోర్నీ నుండి నిష్క్రమిస్తుందా?

భారత జట్టు ఇంకా ఆసియా కప్ నుండి బయటపడే అవకాశం ఉందా? దీనికి సమాధానం లేదు అనే చెప్పాలి. భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్-4లో తమ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.. కానీ భారత్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. ఒకవేళ పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో యూఏఈని ఓడించినా, దానికి 4 పాయింట్లు మాత్రమే వస్తాయి. మిగిలిన రెండు జట్లు గరిష్టంగా రెండు పాయింట్లు మాత్రమే సాధించగలవు.

సూపర్-4 కోసం జట్ల పరిస్థితి

భారత జట్టు మొదటి మ్యాచ్‌లో యూఏఈని 9 వికెట్ల తేడాతో, పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు భారత జట్టు తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమాన్‌తో జరగనుంది. మరోవైపు, పాకిస్థాన్ సూపర్-4లో వెళ్లాలంటే తప్పనిసరిగా తమ చివరి గ్రూప్ మ్యాచ్ గెలవాలి. పాకిస్థాన్ చివరి గ్రూప్ మ్యాచ్ సెప్టెంబర్ 17న యూఏఈతో ఉంది.

మళ్లీ భారత్ vs పాకిస్థాన్ పోరు

భారత్, పాకిస్థాన్ రెండు జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తే వాటి మధ్య మరో పోరు ఖాయం. ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్‌ల పరంపర ఇక్కడితో ఆగదు, ఎందుకంటే సూపర్-4లో టాప్-2లో నిలిస్తే ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..