IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌ లేనట్లేనా..? దాయాదుల మధ్య విలన్‌గా మారిన వరుణుడు.. ప్రస్తుత వాతావరణం ఎలా ఉందంటే..?

|

Sep 02, 2023 | 10:42 AM

IND vs PAK: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ఆసియా కప్‌ వేదిక కాబోతోంది. క్రికెట్‌ మ్యాచ్‌లా కాకుండా యుద్ధంలా సాగే భారత్‌-పాకిస్థాన్‌ మెగా పోరుకు అంతా సిద్ధమైంది. పాకిస్థాన్‌ ఇప్పటికే నేపాల్‌ను చిత్తు చేసి టోర్నీని ఘనంగా ఆరంభించగా.. భారత్‌ ఈ మ్యాచ్‌తోనే తన పోరాటాన్ని మొదలుపెట్టబోతోంది. 

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌ లేనట్లేనా..? దాయాదుల మధ్య విలన్‌గా మారిన వరుణుడు.. ప్రస్తుత వాతావరణం ఎలా ఉందంటే..?
IND vs PAK, Asia Cup 2023
Follow us on

IND vs PAK: గత కొన్నేళ్లలో పాక్‌ బలం పెరిగినా.. అప్పుడప్పుడు కొన్ని విజయాలు సాధించినా.. ఇప్పటికీ భారత్‌దే పైచేయి. ఇవాళ కూడా రోహిత్‌ సేనే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే బలమైన బౌలింగ్‌, ఈ మధ్య మెరుగుపడ్డ బ్యాటింగ్‌తో పాక్‌ ప్రమాదకరంగానే కనిపిస్తోంది. కాబట్టి హోరాహోరీ పోరు తప్పదు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై శతకంతో అదరగొట్టిన రోహిత్‌.. ఇప్పుడు కెప్టెన్‌గా అలాంటి ఇన్నింగ్స్‌తోనే జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. ఇంకా గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ మీద కూడా అందరి దృష్టి ఉంది. మిడిలార్డర్‌లో హార్దిక్‌ కీలకం కానున్నాడు. జడేజా నేటి మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపిస్తాడని జట్టు ఆశిస్తోంది.

అయితే భారత్‌-పాక్‌ పోరుకు వర్షం ముప్పుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌కు వేదికైన క్యాండీలోని పల్లెకెలె మైదానంలో ఇవాళ వర్షం పడే అవకాశముంది. ప్రస్తుతం క్యాండీ వాతావరణం కూడా వర్షం పడే సూచనలతో భయపెడుతోంది. ఒకవేళ మ్యాచ్‌ మధ్యలో వర్షం ఇబ్బంది పెట్టినా.. మ్యాచ్‌ పూర్తయి ఫలితం వస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే, మ్యాచ్ రద్దయితే భారత్, పాక్ జట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో ఇప్పటికే నేపాల్‌పై గెలిచిన పాక్ జట్టు 3 పాయింట్లతో నేరుగా సూపర్ 4 రౌండ్‌కి చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వాతావరణ నివేదిక

 

క్యాండీలో ఆవరించిన మేఘాలు..

ఆసియా కప్‌ కోసం భారత జట్టు..

ఇదిలా ఉండగా.. భారత్‌తో నేటి మ్యాచ్‌లో తలపడే బాబర్ సేనను ముందుగానే ప్రకటించింది పాకిస్తాన్. ఈ జట్టులో భారత్‌ని కట్టడి చేయగల షాహీన్ ఆఫ్రిదీ, హరీస్ రవుఫ్ వంటి ప్లేయర్లు ఉండగా.. వీరిపై విజృంభించేందుకు రోహిత్ సేన కూర్పు ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

భారత్‌తో తలపడే పాక్ ప్లేయింగ్ ఎలెవన్.. 

నేడు తలపడే ఇరు జట్ల వివరాలు..

భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

పాకిస్థాన్ జట్టు(కన్ఫర్మ్): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..