
షాహీన్ షా అఫ్రిది.. టీమిండియాకి అతిపెద్ద ముప్పుగా మారే పాకిస్తాన్ కీ ఫాస్ట్ బౌలర్. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఈ బౌలర్ రోహిత్ సేనకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అయితే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది గాయం కారణంగా.. తన కోటా బౌలింగ్ పూర్తి చేయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్రిది కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. గాయంతో మిగిలిన 5 ఓవర్ల కోటా పూర్తి చేయకుండానే మైదానం వీడాడు. అతడి గాయం తీవ్రత ఎలాంటిదన్న దానిపై క్లారిటీ లేదు గానీ.. ఒకవేళ సెప్టెంబర్ 2న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో షాహీన్ ఆడితే.. టీమిండియా టార్గెట్ అతడే.. ఆడకపోతే మాత్రం పాకిస్తాన్‌కి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.
1. షాహీన్ భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడకపోతే, ఆరంభ ఓవర్లలో పాక్ జట్టుకు వికెట్లు దక్కడ కష్టమే. కొత్త బంతితో వికెట్లు తీయడం షాహీన్ స్పెషాలిటీ. బౌలింగ్‌లో పాకిస్థాన్‌కు అవసరమైన ఆరంభాన్ని అందించగలడు.
2. షాహీన్ లేకపోవడం వల్ల, పాకిస్తాన్ పవర్‌ప్లేలో కూడా గట్టిగానే నష్టపోతుంది. నిజానికి షాహీన్ అఫ్రిది కేవలం పవర్‌ప్లేలో మాత్రమే వికెట్లు తీయడం కాదు.. పరుగులు కూడా పరిమితంగానే సమర్పిస్తాడు.
3. భారత ఓపెనర్లకు షాహీన్ అఫ్రిది ముప్పుగా మారవచ్చు. వారిని కంట్రోల్ చేయడంలో సమర్ధుడు. ఇలాంటి పరిస్థితిలో, అతడు పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోతే.. భారత్ ఓపెనర్లు వికెట్‌పై స్థిరపడే అవకాశం ఉంటుంది. దీంతో పాకిస్తాన్‌కు మొదటి దెబ్బ పడినట్టే.
4. పాకిస్థాన్‌కు అతిపెద్ద వికెట్ టేకర్ షాహీన్ అఫ్రిది. పవర్‌ప్లేలోనే కాకుండా మిడిల్ ఓవర్లలో కూడా ఈ పని చేయగలడు.
5. షాహీన్ కొత్త బంతితో మాత్రమే కాదు.. డెత్ ఓవర్లలోనూ అద్భుతాలు చేయగలడు. అలాగే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయకుండా అడ్డుకోగలడు.
🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..