
Asia Cup 2023 India vs Pakistan Highlights in Telugu: ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత జట్టు పాకిస్థాన్‌కు 267 పరుగుల విజయలక్ష్యాన్ని అందించగా, వర్షం కారణంగా పాక్ ఇన్నింగ్స్ ప్రారంభించలేకపోయింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది నిముషాలే మిగిలి ఉంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్.. బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి శ్రీలంకలోని పల్లెకలె మైదానం ఆతిథ్యం ఇవ్వబోతోంది. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి ఆసియా కప్ 2023 టోర్నీలో శుభారంభం చేయాలనే యోచనలో టీమిండియా ఉండగా.. నేపాల్‌పై సాధించిన విజయోత్సాహంతో పాక్ ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడే బాబర్ సేనను పాక్ ముందుగానే ప్రకటించగా.. ప్రత్యర్థితో బరిలోకి దిగే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. దీంతో రోహిత్ సేనలో ఏయే ప్లేయర్లకు అవకాశం దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు మొత్తం 17 సార్లు తలపడగా.. 9 సార్లు టీమిండియా విజయం సాధించింది. అలాగే పాకిస్తాన్ 6 మ్యాచ్‌ల్లో విజేతగా నిలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. విశేషం ఏమిటంటే.. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాక్ మధ్య ఒక్కసారి కూడా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగలేదు.
ఇరుజట్ల ప్లేయింగ్ XI
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్.
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, తయ్యబ్ తాహిర్ (రిజర్వ్ ప్లేయర్).
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ప్రసీద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్స్).
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత జట్టు పాకిస్థాన్‌కు 267 పరుగుల విజయలక్ష్యాన్ని అందించగా, వర్షం కారణంగా పాక్ ఇన్నింగ్స్ ప్రారంభించలేకపోయింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
వర్షం కారణంగా ఆట 20 ఓవర్లకు తగ్గించారు. 10:21 గంటలకు ఆట ప్రారంభం కానుంది. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లకు 155 పరుగులు చేయాల్సి ఉంది.
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, వర్షం మళ్లీ మొదలైంది. దీంతో గ్రౌండ్‌లో పట్టాలు కప్పారు.అనుకున్న సమయానికి వర్షం కురవకపోతే ఓవర్ల సంఖ్యను తగ్గించి లక్ష్యాన్ని కూడా మార్చుకోవచ్చు.
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పల్లెకెలేలో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ఒకవేళ అనుకున్న సమయానికి వర్షం ఆగకపోతే ఓవర్లను కుదించవచ్చు. అలాగే పాక్ టార్గెట్ కూడా మారిపోవచ్చు.
భారీ షాట్‌కు యత్నించిన జస్ప్రీత్ బుమ్రా బౌండరీ లైన్ వద్ద చిక్కాడు. దీంతో భారత్ ఆలౌట్ అయ్యింది. భారత్ మొత్తం 10 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 267.
భారత్ తొమ్మిదో వికెట్ పడింది. నసీమ్ షా.. కుల్దీప్ యాదవ్ ను పెవిలియన్ పంపాడు. నసీమ్ వేసిన బంతి కుల్దీప్ బ్యాట్ అంచున తగిలి వికెట్ కీపర్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లడంతో క్యాచ్ పట్టడంలో అతను ఎలాంటి పొరపాటు చేయలేదు.
పాండ్యా, జడేజాలను అవుట్ చేసిన వెంటనే భారత్‌కు మరో దెబ్బ తగిలింది. 45వ ఓవర్ తొలి బంతికి శార్దూల్ ఠాకూర్‌ను నసీమ్ షా అవుట్ చేశాడు. షాదాబ్ ఖాన్ అద్భుత క్యాచ్ పట్టాడు.
రవీంద్ర జడేజాను కూడా ఆఫ్రిది పెవిలియన్ పంపాడు. 43వ ఓవర్ చివరి బంతికి అఫ్రిది వికెట్ తీశాడు. అఫ్రిది వేసిన బంతి అతని బ్యాట్ అంచుకు తగిలి వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ క్యాచ్ పట్టాడు.
హాఫ్ సెంచరీతో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా 87 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 43.2 ఓవర్లలో 242 పరుగులు చేసింది.
భారత జట్టు 37.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 82 (81 బంతులు) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
34 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ 720, హార్దిక్ 50 పరుగులతో క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కిషన్ తన వన్డే కెరీర్‌లో 7వ ఫిఫ్టీని పూర్తి చేశాడు. సెంచరీ భాగస్వామ్యంతో ఈ జోడీ సత్తా చాటింది.
29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇషాన్ 50, హార్దిక్ 37 పరుగులతో క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కిషన్ తన వన్డే కెరీర్‌లో 7వ ఫిఫ్టీని పూర్తి చేశాడు. 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ బాదేశాడు.
25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇషాన్ 43, హార్దిక్ 30 పరుగులతో క్రీజులో నిలిచారు.
టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ 32, హార్దిక్ 16 పరుగులతో క్రీజులో నిలిచారు.
టీమిండియాను ఆదుకుంటాడు అనుకున్న గిల్ (10) కూడా పాక్ బౌలర్ల ముందు తలవంచాడు. దీంతో భారత్ 14.1 ఓవర్లకు 66 పరుగులు చేసి, పీకల్లోతూ కష్టాల్లో కూరుకపోయింది.
వర్షం ఆగిపోవడంతో మరోసారి మ్యాచ్ మొదలైంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా.. ప్రస్తుతం గిల్, ఇషాన్‌ల భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది.
మరోసారి వర్షం రావడంతో, మ్యాచ్‌ను నిలిపేశారు. ప్రస్తుతం టీమిండియా 11.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 51 పరుగులు సాధించింది. షాహీన్ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు.
వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యాక.. టీమిండియాకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. శ్రేయాస్ అయ్యర్ 14 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 9.5 ఓవర్లలో 48 పరుగులు చేసింది.
వర్షం తర్వాత మొదలైన మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), కోహ్లీ (4) త్వరగా పెవిలియన్ చేరారు. డేంజరస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లోనే ఇద్దరూ పెవిలియన్ చేరారు.
వర్షం తర్వాత మొదలైన మ్యాచ్, ఆవెంటనే టీమిండియా సారథి రోహిత్ శర్మ(11) వికెట్ కోల్పోయాడు.
వర్షం ఆగిపోవడంతో.. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది.
వర్షం ఎంట్రీతో మ్యాచ్ ఆగింది. పిచ్‌పై కవర్స్ కప్పి ఉంచారు.
Bad News from Pallekele as rain stopped the play.#INDvsPAK | #PAKvIND | #PAKvsIND | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/SIj1mIwrLM
— Muhammad Shaban (@Shabanabbasi07) September 2, 2023
తొలి 3 ఓవర్లు ముగిసే సిరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ 11 పరుగులు చేయగా, మిగతా ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. గిల్ ఇంకా ఖాతా తెరవలేదు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్.
టాస్ గెలిచిన రోహిత్, ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేయనుంది.
ప్రస్తుతం పల్లెకెలెలో చిరుజల్లులు కురుస్తున్నాయి. పిచ్ పై కవర్స్‌ను అలాగే ఉంచారు.
The main cover is back on! Oh no 😔 #AsiaCup2023 #AsiaCup23 pic.twitter.com/H9x30ZJdAF
— Farid Khan (@_FaridKhan) September 2, 2023
ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు తలడనున్నాయి. అయితే, ఇరుజట్ల ఆటగాళ్లు మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి.
Pakistan and India players meet up ahead of Saturday’s #PAKvIND match in Kandy ✨#AsiaCup2023 pic.twitter.com/iP94wjsX6G
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
చివరిసారిగా 2019లో భారత్-పాక్ వన్డేలు ఆడాయి. గత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాపై 89 పరుగుల తేడాతో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు 50 ఓవర్ల మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడలేదు. మూడేళ్లుగా రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి.