India Vs Pakistan 2022: విరాట్ కోహ్లీ చాలా చెత్త ప్లేయర్.. పాక్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..

|

Sep 04, 2022 | 3:31 PM

Virat kohli:టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సగటు 50.8గా నిలిచింది. అయితే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాత్రం కోహ్లీని చెడ్డ ఆటగాడంటూ చెప్పుకొచ్చాడు.

India Vs Pakistan 2022: విరాట్ కోహ్లీ చాలా చెత్త ప్లేయర్.. పాక్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..
Asia Cup 2022 Virat Kohli
Follow us on

ASIA CUP 2022, Ind Vs Pak: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండోసారి తలపడుతున్నాయి. తొలి పోరులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో పోరులోనూ గెలిచేందుకు రోహిత్ సేన తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ క్రికెటర్లు మరోసారి టీమిండియా ప్లేయర్లపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి గురించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ నోరుజారాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. విరాట్ కోహ్లీ టీ20కి మంచి ఆటగాడు కాదని రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయితే టీ20లో అతని స్ట్రైక్ రేట్ పేలవంగా ఉందని తెలిపాడు.

రషీద్ లతీఫ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, ‘ODIలలో విరాట్ కోహ్లీ దరిదాపుల్లో ఎవరూ లేరు. కానీ టీ20ల్లో మాత్రం అంత మంచిగా ఆకట్టుకోలేదు. అతనికి మంచి సగటు ఉంది. కానీ, స్ట్రైక్ రేట్ మాత్రం అస్సలు బాగోలేదు.

‘విరాట్‌ వల్ల ఆర్‌సీబీ ఛాంపియన్‌ కాలేదు’..

ఇవి కూడా చదవండి

రషీద్ లతీఫ్ మాట్లాడుతూ, ‘విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడతాడా లేదా వేగంగా ఆడతాడా అనేది పట్టింపు లేదు. అతను కొట్టే ముందు 30-35 బంతులు ఆడాలి. పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోగల ఆటగాడు రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలా విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆడలేడు. విరాట్ కోహ్లి స్టైల్ RCBకి కూడా అలాగే ఉంది. అందుకే ఇప్పటి వరకు ఛాంపియన్‌ కాలేకపోయాడు.

విరాట్ కోహ్లీ సూపర్ ఫ్లాప్ అయ్యాడా?

విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్, ఆట తీరుపై రషీద్ లతీఫ్ ప్రశ్నలు లేవనెత్తాడు. అయితే అతను బాబర్ అజామ్‌ గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బాబర్ అజామ్ T20 క్రికెట్‌లో కేవలం 129 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించగా, విరాట్ స్ట్రైక్ రేట్ 137గా నిలిచింది. విరాట్ కోహ్లీ టీ20లో 50కి పైగా సగటును కలిగి ఉన్నాడు. పాకిస్థాన్‌పై అతని టీ20 సగటు 70 కంటే ఎక్కువ ఉంటుంది.

విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర..

ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత, అతను హాంకాంగ్‌పై అజేయంగా 59 పరుగులు చేసి టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతంగా ఆడుతున్నాడు. ఆసియా కప్ ముగిసే సమయానికి రషీద్ లతీఫ్‌కు తగిన సమాధానం ఇస్తాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.