Sunny Comments : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. శతకంతో పాటు ఎనిమిది వికెట్లు సాధించాడు. దీంతో అశ్విన్ తిరిగి భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో చోటు సంపాదిస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వైట్‌బాల్ క్రికెట్‌లో అశ్విన్ రీఎంట్రీకి అవకాశాలు లేవని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు.
ప్రస్తుతం అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోకి వస్తాడనుకోవట్లేదు. ఎందుకంటే ఏడో స్థానంలో హార్దిక్ పాండ్య ఉన్నాడు. ఆ తర్వాత జడేజా ఉంటాడు. జట్టులో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలనుకుంటారు లేదా ఇద్దరు సీమర్లు కావాలనుకుంటారు. అందుకే ప్రస్తుతం అతడికి అవకాశాలు రావని భావిస్తున్నా. అయితే మరో ఆరు సంవత్సరాల పాటు అతడు టెస్టు ప్లేయర్‌గా కొనసాగుతాడు అని గావస్కర్ తెలిపాడు.
మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య