ENG vs AUS: అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మంగళవారం ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బంతిని ఎదుర్కొంటూ కనిపించాడు. ఈ సమయంలో, స్టోక్స్ నుంచి ప్రమాదకరమైన బౌన్సర్ రూట్ హెల్మెట్‌ను తాకింది.
అయితే, గాయం తీవ్రమైనది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే రూట్ తిరిగి బ్యాటింగ్‌కి వచ్చాడు. ఇక రెండో టెస్టు మ్యాచ్ డే నైట్‌గా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ పింక్ బాల్ తోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీడియోలో స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం కనిపించింది. అయితే బ్రిస్బేన్ టెస్టులో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించలేకపోయాడు. తొలి టెస్టులో స్టోక్స్ కూడా గాయపడ్డాడు. అతను కేవలం 12 ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. అలాగే ఈ ఆటగాడు చాలా నో బాల్స్ వేశాడు. ఈ వీడియో చూస్తుంటే రెండో టెస్టులో బౌలింగ్ చేసేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
రూట్ అద్భుత ప్రదర్శన..
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అతను కుదురుకొని 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రూట్ ఔటయ్యాక బ్యాట్స్‌మెన్ ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి యాషెస్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Ben Stokes hits Joe Root on the head in the Adelaide nets. Box office, always. pic.twitter.com/MBbac4RSsR
— Will Macpherson (@willis_macp) December 14, 2021