Virat Kohli: టెస్టుల్లో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఆ మొనగాడే.. ఎవరా ప్లేయర్.?

ఇంఇంగ్లాండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త ఎడిషన్ ప్రారంభమవుతుంది. అంతకు ముందు, ఇద్దరు సూపర్ స్టార్ల రిటైర్‌మెంట్ ప్రకటించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు?

Virat Kohli: టెస్టుల్లో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఆ మొనగాడే.. ఎవరా ప్లేయర్.?
Virat Kohli

Updated on: May 12, 2025 | 7:19 PM

టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ బాటలోనే 10 వేల పరుగులు కాకముందే విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రో-కో ద్వయం T20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి రో-కో ఇకపై టెస్టుల్లో కూడా కనిపించరు. కొద్దిరోజుల్లో ఇంగ్లాండ్ పర్యటన మొదలుకానుంది. ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త ఎడిషన్ ప్రారంభమవుతుంది. అంతకముందే ఇద్దరు సూపర్‌స్టార్లు రిటైర్ కావడంతో.. వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ఇప్పుడు చూసేద్దాం..

సర్ఫరాజ్ ఖాన్:

రెడ్ బాల్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సుస్థిరమైన ప్రదర్శనతో సత్తా చాటాడు. దీంతో 2024లో టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత రెగ్యులర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి సర్ఫరాజ్ మంచి పోటీని ఇవ్వగలడు.

కెఎల్ రాహుల్:

జట్టు అవసరాలను బట్టి కెఎల్ రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడగలడు. కొన్నిసార్లు ఓపెనర్‌గా.. మరికొన్నిసార్లు మిడిల్ ఆర్డర్‌లో.. ఇంకొన్నిసార్లు లోయర్ ఆర్డర్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ రిటైర్‌మెంట్‌తో 4వ స్థానంలో రాహుల్ ఆడటం దాదాపుగా ఖాయం అయిందని చెప్పొచ్చు.

రజత్ పాటిదార్:

ఈ మధ్యకాలంలో రజత్ పాటిదార్ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు. టీ20లైనా.. డొమెస్టిక్ టెస్టులైనా.. అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో అతడికి భారత టెస్ట్ జట్టులో చోటు లభించవచ్చు.

శ్రేయాస్ అయ్యర్:

కెఎల్ రాహుల్ మాత్రమే కాకుండా.. విరాట్ కోహ్లి స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేయగల సమర్ధుడు. అతనికి టెస్ట్ జట్టులో చోటు దక్కవచ్చు. 2024 ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో స్వదేశానికి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాలు, వార్షిక కాంట్రాక్ట్‌ నుంచి తొలగించడం లాంటివి జరిగాయి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో 4వ స్థానంలో విరాట్ కోహ్లీకి బదులుగా శ్రేయాస్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

సాయి సుదర్శన్:

ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. విరాట్-రోహిత్ రిటైర్మెంట్‌తో సుదర్శన్ నిలకడ కారణంగా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతనికి కౌంటీ క్రికెట్ ఆడిన మంచి అనుభవం కూడా ఉంది. ఫలితంగా ఇంగ్లాండ్ సిరీస్‌లో అతను వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్‌గా ఆడతాడు. కావాలంటే సెలెక్టర్లు అతడ్ని 4వ స్థానంలో కూడా ప్రయత్నించవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..