
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ.. బాలీవుడ్, క్రికెట్ ప్రపంచంలో ఫ్యాన్స్ అభిమానించే జంటల్లో ఒకరు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో లండన్‌లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇద్దరు ఒకప్పుడు బ్రేకప్ చెప్పుకుని.. తమ లవ్ లైఫ్‌కు ఓ ఎండ్ కార్డు వేద్దామని అనుకున్నారు. ఈ విషయం మీకు తెలుసా.? అప్పుడే ఓ స్టార్ హీరో మధ్యలోకి ఎంటర్ అయ్యి.. వీళ్ళిద్దరికీ ప్యాచప్ చెప్పాడు. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..
రెండు రోజుల క్రితమే విరాట్ కోహ్లి తన 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ తరుణంలో అతడు తన జీవితంలో ఎదుర్కున్న ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాతే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా పాపులర్ అయింది. ఇదిలా ఉంటే.. గతంలో వీరిద్దరూ విడిపోవాలని అనుకున్నారు. పెళ్లికి ముందు విరాట్, అనుష్క తమ రిలేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు.
అంటే.. 2016వ సంవత్సరం వీరిద్దరూ విడిపోయారని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క యాక్టింగ్ చేయడం విరాట్‌కి నచ్చడం లేదని.. ఆమెను ఇండస్ట్రీ నుంచి వైదొలగమన్నాడని.. ఇక అందుకు అనుష్క ఒప్పుకోలేదని.. ఇలా ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఇవేమి సరైనవి కాకపోగా.. విడిపోవడానికి గల అసలు కారణాలు ఏమి బయటకు రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఈ జంట మళ్లీ తిరిగి కలుసుకోవడం.. ఇక ఇప్పుడు విడదీయరాని బంధంలో ముడిపడిపోవడం మనకు తెలిసిందే. అప్పుడు బ్రేకప్ జరిగిన మొదట్లో అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మ ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. అయితే ‘సుల్తాన్’ చిత్రంలో అనుష్కతో కలిసి నటించిన సల్మాన్ ఖాన్.. మళ్లీ ఈ ప్రేమ జంట ఒకటి కావడంలో ముఖ్యపాత్ర పోషించాడని తెలుస్తోంది.