ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్‌లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెంచరీ కొట్టిన వెంటనే సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఈ కుర్ర క్రికెటర్ కు అభినందనలు తెలిపారు. ఇక మెల్ బోర్న్ స్టేడియంలోని క్రికెట్ అభిమానులైతే హర్ష ధ్వానాలతో మోత మోగించారు. ఇక స్వదేశంలోనూ నితీశ్ రెడ్డికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ యంగ్ క్రికెటర్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా నితీశ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
అదే సమయంలో ఈ వైజాగ్ కుర్రోడికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నినితీశ్ రెడ్డికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఇక శాప్ ఛైర్మన్ రవినాయుడు కూడా నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శన ను కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నితీశ్ కుమార్ అత్యుత్తమంగా రాణించారని కితాబిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నితీశ్ సెంచరీ చేయడం ఏపీకి గర్వకారణమని రవినాయుడు పేర్కొన్నారు.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్నలో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత… pic.twitter.com/93QcoWeTOx
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2024
h3>నితీశ్ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం.. వీడియో..
An emotional interview of Nitish Kumar Reddy’s family. 🥹❤️pic.twitter.com/MgivG6mlkH
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..