Team India: అనంత్ అంబానీ- రాధికల పెళ్లి వేడుకల్లో ప్రపంచకప్ హీరోలకు ఘన సన్మానం.. వీడియో చూశారా?

|

Jul 06, 2024 | 6:21 PM

'సుమారు 17 ఏళ్ల తర్వాత భారత్ కు టీ20 ప్రపంచకప్ తీసుకొచ్చిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయం సాధించి భారత్‌కు తిరిగి వచ్చిన భారత జట్టు ఆటగాళ్లను పలు చోట్ల ఘనంగా సత్కరిస్తున్నారు. ఇప్పుడు అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ కూడా భారత జట్టును ఘనంగా సత్కరించింది.

Team India: అనంత్ అంబానీ- రాధికల పెళ్లి వేడుకల్లో ప్రపంచకప్ హీరోలకు ఘన సన్మానం.. వీడియో చూశారా?
Team India, Ambani Family
Follow us on

‘సుమారు 17 ఏళ్ల తర్వాత భారత్ కు టీ20 ప్రపంచకప్ తీసుకొచ్చిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయం సాధించి భారత్‌కు తిరిగి వచ్చిన భారత జట్టు ఆటగాళ్లను పలు చోట్ల ఘనంగా సత్కరిస్తున్నారు. ఇప్పుడు అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ కూడా భారత జట్టును ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డాషింగ్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్‌లను వేదికపైకి ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. కాగా ప్రస్తుతం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజర్యారు. ఈ సందర్భంగా రోహిత్ సతీమణి రితికా చేయిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు నీతా అంబానీ. ఆ తర్వాత రోహిత్ ను పట్టుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ క్యాచ్ గురించి నీతా అంబానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు నీతా అంబానీ. కఠిన పరిస్థితులు మనుషుల్ని మరింత బలంగా మారుస్తాయని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారామె. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి

ఈ వీడియోల్లో రోహత్మ, హార్దిక్ పాండ్యా , సూర్యకుమార్ యాదవ్ లహరో దో పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా హాజరయ్యారు. అలాగే దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ తన భార్య సాగరికా ఘట్గేతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నాడు.

 

జూన్ 29న రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బార్బడోస్ నుంచి స్వదేశానికి చేరుకున్నప్పటి నుంచి టీమ్ ఇండియా ప్లేయర్లకు వరుసగా సన్మానాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఆ తర్వాత ముంబైలో భారత జట్టు విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..