ICC Cricket World Cup 2023: ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 మొదలైంది. వరల్డ్‌కప్ భారత్‌లో జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కొందరు స్టేడియానికి వెళ్తే మరికొందరు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీల్లో మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం వరల్డ్ కప్ కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. దీంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు కానుంది. ఈ స్పెఫల్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. ఎలాంటి నెట్‌వర్క్ సమస్యలు లేకుండా ఈ మ్యాచ్‌ని అందరూ ఆస్వాదించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఎయిర్‌టెల్ రెండు ప్రత్యేక ప్లాన్‌లను విడుదల చేసింది. ప్రతి క్రికెట్ అభిమాని మ్యాచ్ వీక్షించేందుకుగానూ రూ.49, రూ.99తో ప్రత్యేక క్రికెట్ ప్లాన్లను రూపొందించింది. ఈ విషయాన్ని బిజినెస్ టుడే నివేదించింది.
ఎయిర్‌టెల్ క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు ప్లాన్స్‌ను ప్రారంభించింది. ప్రపంచకప్‌లో ప్రతి క్షణాన్ని చూడాలని ఆసక్తిగా ఉన్న ప్రజలకు ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి. ఈ ప్లాన్‌లు ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
తక్కువ ధర ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ రూ.49 ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది క్రికెట్ స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 6 GB డేటా వినియోగాన్ని పొందుతారు. ఇది ఒక రోజు చెల్లుబాటు అవుతుంది.
ఎయిర్‌టెల్ 2 రోజుల వ్యాలిడిటీతో రూ.99 ప్రత్యేక క్రికెట్ ప్లాన్‌ను ప్రారంభించింది. తద్వారా వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ని చూసి ఆనందించవచ్చు. ఇది అపరిమిత డేటాను అందిస్తుంది.
మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు లేకుండా క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు Airtel DTH స్టార్ నెట్‌వర్క్‌తో చర్చలు జరుపుతోంది. క్రికెట్ ప్రేమికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి Airtel Xtreme Boxలో క్విక్ యాక్సెస్ ప్రోమో రైల్ పరిచయం చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..