Shoaib Malik : మూడో భార్యకు విడాకులు ఇచ్చిన సానియా మిర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నేళ్లుగా తన ఆట కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా, గత ఏడాది భారత టెన్నిస్ స్టార్, తన మాజీ భార్య సానియా మీర్జాకు ద్రోహం చేసి మూడో పెళ్లి చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఇప్పుడు అతని మూడో పెళ్లి బంధంలోనూ అంతా సవ్యంగా లేదనే పుకార్లు మొదలయ్యాయి.

Shoaib Malik : మూడో భార్యకు విడాకులు ఇచ్చిన సానియా మిర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్!
Shoaib Malik

Updated on: Oct 04, 2025 | 1:26 PM

Shoaib Malik : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నేళ్లుగా తన ఆట కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. గత ఏడాది తన మాజీ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ద్రోహం చేసి మూడో పెళ్లి చేసుకోవడం వల్ల మాలిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, ఇప్పుడు అతని మూడో పెళ్లి బంధంలోనూ అంతా సవ్యంగా లేదనే గుసగుసలు మొదలయ్యాయి. కేవలం ఏడాదిన్నరలోనే షోయబ్ మాలిక్, పాకిస్తాన్ నటి సనా జావేద్‎ల బంధం కూడా ముగింపుకు చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షోయబ్ మాలిక్, పాకిస్తానీ నటి సనా జావేద్ జనవరి 2024లో తమ వివాహ ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటన కంటే ముందే సానియా మీర్జా, మాలిక్ ల మధ్య సంబంధం తెగిపోయిందనే ఊహాగానాలు వినిపించాయి. మాలిక్, సనా జావేద్‌తో తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. ఆ తర్వాతే, సానియా కుటుంబం, ఇద్దరూ కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారని వెల్లడించింది.

షోయబ్ మాలిక్ తరచుగా ఇతర మహిళలతో అఫైర్స్ పెట్టుకోవడం వల్లనే సానియా విసిగిపోయి విడాకులు తీసుకున్నట్లు మాలిక్ సోదరి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సనా జావేద్‌కు కూడా ఇది రెండో వివాహం. ఆమె కూడా మాలిక్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు తన పాత బంధాన్ని తెంచుకుంది. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన తర్వాత మాలిక్, సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ వివాహం జరిగి కేవలం ఏడాదిన్నర కాకముందే బంధం విడిపోతుందనే పుకార్లు మొదలయ్యాయి.

దీనికి కారణం తాజాగా సోషల్ మీడియాలో బయటపడిన ఒక వీడియో. ఆ వీడియోలో షోయబ్ మాలిక్, సనా జావేద్ ఒక ఈవెంట్‌లో పక్కపక్కనే కూర్చున్నారు. అయితే, ఆ సమయంలో ఇద్దరూ ఎటువంటి సంభాషణలు గానీ, సైగలు గానీ చేసుకోలేదు. షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా, సనా మరోవైపు ముఖం తిప్పుకుని కూర్చుంది. సనా ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నుంచే మాలిక్, సనాల బంధం కూడా విడిపోయే దశకు చేరుకుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఇందులో నిజం ఎంత ఉందనేది ఇప్పుడే చెప్పలేం. షోయబ్ మాలిక్‌కు సనా జావేద్ మూడో భార్య. అతని మొదటి భార్య ఆయేషా సయీద్. ఆమెతో 8 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత 2010లో సానియా మీర్జాను పెళ్లి చేసుకోగా, ఆ బంధం 2024లో ముగిసింది. షోయబ్ మాలిక్ తన వ్యక్తిగత జీవితంలోని వివాదాల కారణంగా క్రీడా ప్రపంచంలో కంటే ఎక్కువగా పాకిస్తానీ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతున్నారు. ఈ తాజా వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి