Afghanistan T20 World Cup Squad: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో కలకలం.. టీ20 జట్టు ప్రకటించిన వెంటనే షాకిచ్చిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా?

|

Sep 10, 2021 | 8:02 AM

టీ 20 వరల్డ్ కప్ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరుగుతుంది. యూఏఈలో నిర్వహించచనున్న పొట్టి ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాప్ -8 లో అర్హత సాధించడంతో ప్రధాన జట్టుగా బరిలోకి దిగనుంది.

Afghanistan T20 World Cup Squad: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో కలకలం.. టీ20 జట్టు ప్రకటించిన వెంటనే షాకిచ్చిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా?
Rashid Khan
Follow us on

Afghanistan T20 World Cup Squad: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో కొత్త రగడ మొదలైంది. టీ 20 ప్రపంచకప్ కోసం బోర్డు 17మందితో జట్టును ప్రకటించింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో జట్టును ఎంపిక చేశారు. సీనియర్ కీపర్ మహ్మద్ షాజాద్ కూడా ఈ జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ, జట్టు ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే రషీద్ ఖాన్ రాజీనామా చేశారు. టీ 20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ముందు తనతో మాట్లాడలేదంటూ బాంబ్ పేల్చాడు. టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. ఇది యూఏఈ, ఒమన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అర్హత మ్యాచ్‌లు ఒమన్‌లో జరుగుతాయి. ప్రధాన మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయి.

రషీద్ ఖాన్ మాట్లాడుతూ, ‘కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన దేశ పౌరుడిగా, జట్టు ఎంపికలో భాగం కావడం నా హక్కు. జట్టును ప్రకటించడానికి ముందు సెలెక్షన్ కమిటీ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నన్ను సంప్రదించలేదు. ఆఫ్ఘనిస్తాన్ టీ 20 టీమ్ కెప్టెన్ పదవి నుంచి తక్షణం వైదొలుగుతున్నాను. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఆడటం నాకు ఎప్పుడూ గర్వకారణమే’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. రషీద్ ఖాన్ జూలైలోనే టీ 20 టీం కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. టీ 20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాలిబన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. దీంతో రషీద్ ఖాన్ సమస్య క్రికెట్ భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడేస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఇబ్బందుల్లో పడింది. మహిళలు ఆడడాన్ని తాలిబన్ నిషేధించింది. ఇది మహిళల క్రికెట్ జట్టుకు మరింత సంకటంగా తయారైంది. ఈ కారణంగా, ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్‌తో తన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. టీ 20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీం భారత్‌ ఉన్న గ్రూపులోనే ఉంది. అలాగే ఈ గ్రూపులో పాకిస్తాన్, న్యూజిలాండ్ టీంలో కూడా ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), హజ్రతుల్లా జజాయ్ (కీపర్), ఉస్మాన్ ఘని, అస్ఘర్ ఆఫ్ఘన్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జాద్రాన్, హష్మతుల్లా షాహిది, మహ్మద్ షాజాద్, ముజీబ్ ఉర్ రహమాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నవీన్ ఉల్ హ హ హమీద్ హసన్, షర్ఫుద్దీన్ అష్రాఫ్, దౌలత్ జద్రాన్, షఫూర్ జాద్రాన్, కైస్ అహ్మద్.

Also Read:

West Indies T20 World Cup Squad: టీ 20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టు ప్రకటన.. సునీల్ నరైన్‌కు దక్కని చోటు

IND vs ENG: ఆటగాళ్లందరికీ నెగిటివ్.. మాంచెస్టర్ టెస్ట్‌పై వీడిన ఉత్కంఠ