కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే.. గంభీర్ నయా స్కెచ్..?

IND vs AFG T20: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనింగ్ జోడీపై గౌతమ్ గంభీర్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యవంశీ, అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చి, ఇక మూడో స్థానంలో శాంసన్ ను ఉపయోగించే అంశాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే.. గంభీర్ నయా స్కెచ్..?
Afg Vs Ind T20i Series

Updated on: Sep 02, 2026 | 10:30 AM

IND vs AFG T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉన్న నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యవంశీ, అభిషేక్‌లను ఓపెనర్లుగా కొనసాగించే అవకాశం ఉంది. వీరిలో ఎవరైనా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోతే మూడో మ్యాచ్‌లో శాంసన్ కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తొలి రెండు మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తే అదే జోడీని కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే శాంసన్ ను పూర్తిగా తప్పించకుడా, మూడో స్థానంలో ఉపయోగించే అంశాన్ని కూడా గంభీర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

శాంసన్ కు మూడో స్థానంలో ఛాన్స్..?

శాంసన్ ను టాప్‌-3లో కుడిచేతి బ్యాటర్‌గా ఉపయోగించడం ద్వారా జట్టు కూర్పులో సమతౌల్యం తీసుకురావచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో శాంసన్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్‌గా ఉన్నారు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యారు.

Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!

ఇవి కూడా చదవండి

శాంసన్ కు ఓపెనింగ్‌తో పాటు మూడో స్థానంలోనూ అవకాశం ఉండటంతో టాప్‌ ఆర్డర్‌పై ఆసక్తి నెలకొంది. అయితే గంభీర్‌కు సంబంధించిన ఈ ఓపెనింగ్ స్ట్రాటజీ అధికారికంగా ప్రకటించిన నిర్ణయం కాదు. అందువల్ల తుది మ్యాచ్‌ కూర్పు సిరీస్‌ ప్రారంభానికి ముందు స్పష్టమవుతుంది.

సెప్టెంబర్ 13 నుంచి సిరీస్..

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మూడు మ్యాచ్‌లూ ఢిల్లీలోనే నిర్వహిస్తున్నారు. భారత జట్టులో సూర్యవంశీకి చోటు దక్కడంతో యువ ఓపెనర్‌పై కూడా ప్రత్యేక అంచనాలు ఉన్నాయి.

Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us