Adam Gilchrist : ఎన్ని పరుగులు చేశామన్నది కాదు.. ఎప్పుడు చేశామన్నదే ముఖ్యం.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన కామెంట్స్..

|

Mar 06, 2021 | 8:54 PM

Adam Gilchrist : ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో రిషభ్‌పంత్ కీలక ఇన్సింగ్స్ ఆడిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో అతడిపై భారత మాజీ

Adam Gilchrist : ఎన్ని పరుగులు చేశామన్నది కాదు.. ఎప్పుడు చేశామన్నదే ముఖ్యం.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన కామెంట్స్..
Follow us on

Adam Gilchrist : ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో రిషభ్‌పంత్ కీలక ఇన్సింగ్స్ ఆడిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో అతడిపై భారత మాజీ ఆటగాళ్లే కాకుండా ఇతర దేశాల క్రికెటర్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌(60; 117 బంతుల్లో 8×4)తో కలిసి పంత్‌(101; 118 బంతుల్లో 13×4, 2×6) ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించాడు.

ఇది పంత్‌ కెరీర్‌లో మేటి ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలోనూ సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, ఇంగ్లాండ్‌ మాజీ సారథులు మైఖేల్‌ వాన్‌, పీటర్సన్‌తో పాటు తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ సైతం పొగడ్తలతో ముంచెత్తాడు. ‘నువ్వెన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు. ఎప్పుడు చేశావన్నదీ ముఖ్యమే. తొలి ఇన్నింగ్స్‌ లాగే నువ్వు రెండో ఇన్నింగ్స్‌లోనూ సమన్వయంతో ఆడి జట్టుకు అవసరమైన వేళ రాణించినప్పుడు.. నిజమైన మ్యాచ్‌ విన్నర్‌వి. నిన్ను గమనిస్తూనే ఉంటా పంత్‌’ అని ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ ఇన్నింగ్స్‌తో పంత్‌ భారత్‌లో తొలి టెస్టు శతకం సాధించడమే కాకుండా గిల్‌క్రిస్ట్‌కు సంబంధించిన ఒక రికార్డునూ చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు శతకాలు సాధించిన రెండో కీపర్‌గా పంత్‌ నిలిచాడు. ఇంతకుముందు గిల్‌క్రిస్ట్‌ మాత్రమే మూడు ఉప ఖండాల్లో మూడంకెల స్కోర్లు చేశాడు. దీంతో ఈ యువబ్యాట్స్‌మన్‌ను అభిమానులు గిల్‌క్రిస్ట్‌తో పోల్చుతున్నారు.

పులితో ఫొటో దిగడం ఈ మలయాళీ ముద్దుగుమ్మకే సాధ్యం.. విజయ్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలిగా మరీ..