Rohit Sharma: హృదయ విదారకంగా ఉంది.. రిటెన్షన్ తర్వాత రోహిత్ స్పందన..

|

Dec 02, 2021 | 8:34 AM

తమ జట్టు సభ్యులను దక్కించుకోకపోవడం "హృదయ విదారకంగా" ఉందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఐపీఎల్ 2022లో మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంచైజీ రోహిత్‌తో సహా జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ రిటైన్ చేసుకుంది...

Rohit Sharma: హృదయ విదారకంగా ఉంది.. రిటెన్షన్ తర్వాత రోహిత్ స్పందన..
Rohith
Follow us on

తమ జట్టు సభ్యులను దక్కించుకోకపోవడం “హృదయ విదారకంగా” ఉందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఐపీఎల్ 2022లో మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంచైజీ రోహిత్‌తో సహా జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ రిటైన్ చేసుకుంది. గరిష్ఠంగా ముగ్గిరినే తిరిగి తీసుకునే అవకాశం ఉండడంతో వీరినే తీసుకుంది. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లలో తమ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ వంటి వారిని మాత్రం ఎంఐ నిలుపుకోలేకపోయింది.

ఈ సంవత్సరం నిలుపుదల ముంబై ఇండియన్స్‌కు “కఠినమైనది” అని రోహిత్ పేర్కొన్నాడు. జట్టులోని “గన్-ప్లేయర్లను” విడుదల చేయడం చాలా కఠినమైన నిర్ణయమని చెప్పాడు. “మీ అందరికీ తెలిసినట్లుగా ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్‌కు ఇది కష్టతరమైన రిటెన్షన్ అవుతుంది. మా జట్టులో పటిష్టమైన ఆటగాళ్లు ఉన్నారు. ఖచ్చితంగా గన్ ప్లేయర్‌లు ఉన్నారు. వారిని విడుదల చేయడం చాలా హృదయ విదారకంగా ఉంది” అని రోహిత్ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.

మంగళవారం జరిగిన ఐపీఎల్ రిటెన్షన్‎లో రోహిత్‎ను 16 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. “ఈ ఫ్రాంచైజీ కోసం ఆటగాళ్లు అద్భుతంగా పని చేశారు. వారిని విడిచిపెట్టడం చాలా కష్టం. నాతో సహా నలుగురు ఆటగాళ్లు మంచి కోర్‌ని ఏర్పరుచుకుంటాము. మా చుట్టూ పటిష్టమైన జట్టును సృష్టించగలమని ఆశిస్తున్నాము” అని రోహిత్ అన్నాడు. అయితే 15వ ఎడిషన్ టోర్నీకి ముందు ఐపీఎల్ మెగా వేలం జరిగినప్పుడు విడుదలైన ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఎంఐకి ఉంటుంది. ఒక పటిష్టమైన జట్టును ఏర్పాటు చేయడం తక్షణ లక్ష్యమని రోహిత్ అన్నాడు.

Read Also.. CSA: BCCIతో నిరంతరం టచ్‎లో ఉన్నాం.. దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన ఉంటుంది..