Abhishek Sharma : 6,6,6,6,4,4,4,4..షేకాడించిన అభిషేక్.. గురువు మించిన శిష్యుడు

Abhishek Sharma : టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించిన అభిషేక్, తన గురువు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, సిక్సర్ల వేటలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Abhishek Sharma : 6,6,6,6,4,4,4,4..షేకాడించిన అభిషేక్.. గురువు మించిన శిష్యుడు
Abhishek Sharma (2)

Updated on: Jan 22, 2026 | 3:07 PM

Abhishek Sharma : టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మార్క్ పవర్ హిట్టింగుతో న్యూజిలాండ్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న మొదటి టీ20లో అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‎లో 4 ఫోర్లు, 4 భారీ సిక్సులు ఉండడం విశేషం. అయితే అక్కడితో ఆగకుండా కివీస్ బౌలర్లను ఆటాడుకున్న ఈ పంజాబ్ యంగ్ సెన్సేషన్.. మొత్తం 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 16 పరుగుల తేడాతో కేవలం 16 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, అభిషేక్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కివీస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో అభిషేక్ తన గురువు, మెంటార్ అయిన యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 ఇంటర్నేషనల్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఇప్పుడు యువరాజ్ (74 సిక్సర్లు)ను దాటేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. యువరాజ్ సింగ్ 51 ఇన్నింగ్స్‌లలో 74 సిక్సర్లు కొట్టగా, అభిషేక్ శర్మ కేవలం 33 ఇన్నింగ్స్‌లలోనే 81 సిక్సర్లను చేరుకున్నాడు. అంటే యువరాజ్ కంటే 18 ఇన్నింగ్స్ ముందే ఈ ఘనత సాధించి తన సిక్స్ హిట్టింగ్ పవర్‌ను ప్రపంచానికి చాటాడు.

ప్రస్తుతం భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో అభిషేక్ 6వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ (205 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (156), విరాట్ కోహ్లీ (124), హార్దిక్ పాండ్యా (106), కేఎల్ రాహుల్ (99) వరుసగా ఐదు స్థానాల్లో ఉన్నారు. రాబోయే మ్యాచుల్లో అభిషేక్ ఇలాగే రెచ్చిపోతే కేఎల్ రాహుల్ రికార్డు కూడా త్వరలోనే మాయమయ్యే అవకాశం ఉంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత అభిషేక్ అవుట్ అయి ఫెవీలియన్ కు చేరుతున్నప్పుడు సెంచరీ మిస్ అయిన బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.

2026 టీ20 ప్రపంచకప్‌కు అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకోవడం సరైన డెసిషన్ అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారడం ఖాయం. మెగా టోర్నీలో కూడా అభిషేక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియాకు మరోసారి ట్రోఫీ దక్కడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..