IND vs SA: రహానే, శుభ్‌మన్‌, ఇషాంత్‌లకు నో ప్లేస్‌.. సౌతాఫ్రికా టూర్‌కు టీమిండియాను ఎంపిక చేసిన ఆకాశ్‌ చోప్రా..

|

Dec 07, 2021 | 1:23 PM

పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌అజింక్యా రహానేకు ఆకాశ్‌ చోప్రా షాక్‌ ఇచ్చాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి తాను ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు ఇవ్వలేదు

IND vs SA: రహానే, శుభ్‌మన్‌, ఇషాంత్‌లకు నో ప్లేస్‌.. సౌతాఫ్రికా టూర్‌కు  టీమిండియాను ఎంపిక చేసిన ఆకాశ్‌ చోప్రా..
Follow us on

పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌అజింక్యా రహానేకు ఆకాశ్‌ చోప్రా షాక్‌ ఇచ్చాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి తాను ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు ఇవ్వలేదు. రహానేతో పాటు గాయంతో బాధపడుతోన్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఫామ్‌లో లేని ఇషాంత్‌ శర్మను కూడా పక్కన పెట్టేశాడు. ఈక్రమంలో మొత్తం15 మందితో తుది జట్టును ప్రకటించాడు. ఇందులో నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లకు స్థానం కల్పించారు. ఎప్పటిలాగే రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. సరిగ్గా ఆడలేకపోతున్నప్పటికీ వన్‌డౌన్‌లో చతేశ్వర్‌ పుజారాకు ఇంకో అవకాశమిచ్చాడు. నాలుగో స్థానంలో కెప్టెన్‌ కోహ్లీని ప్లేస్‌ ఇచ్చిన ఆకాశ్‌ ఐదో స్థానంలో రహానేకు బదులు యంగ్‌ క్రికెటర్‌ శ్రేయస్‌కు చోటు కల్పించాడు. ఇక రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌.. ఆల్‌రౌండర్‌ కోటాలో జడేజా, అశ్విన్‌లకు జట్టులో చోటిచ్చాడు. ఇక పేసర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎంపిక చేశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో సెంచరీతో రాణించిన మయాంక్‌ అగర్వాల్‌, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి, పేసర్లు శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌లను రిజర్వ్‌ ఆటగాళ్లుగా తీసుకున్నాడు. కాగా ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనపై ముందుగా సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు హామీ ఇవ్వడంతో టీమిండియా క్రికెటర్లు సౌతాఫ్రికా విమానం ఎక్కేందుకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) కొత్త షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. కాగా సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే భారతజట్టును బీసీసీఐ నేటి సాయంత్రం ప్రకటించే అవకాశముంది.

Also Read:

IND VS SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో వీరిద్దరికి నో ఛాన్స్.. తెలుగు కుర్రాడికి అవకాశం: వీవీఎస్ లక్ష్మణ్

IND vs SA: టెస్ట్ కెప్టెన్సీలో ఆయనే నంబర్ వన్.. అక్కడ సిరీస్ గెలిస్తే చరిత్రలో నిలుస్తాడు: టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్

Ashes Series: యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం..!