Asia Cup: ముదురుతున్న రగడ.. అక్తర్, షఫీక్ ల మధ్య కొనసాగుతున్న ట్వీట్ల యుద్ధం.. గెలుపు ఓటములను స్వీకరించాలని చురక

|

Sep 08, 2022 | 4:21 PM

ఆసియా కప్ (Asia cup) లో భాగంగా బుధవారం (నిన్న) జరిగిన మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ మధ్య పోరు జరిగింది. ఈ గేమ్ లో పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన...

Asia Cup: ముదురుతున్న రగడ.. అక్తర్, షఫీక్ ల మధ్య కొనసాగుతున్న ట్వీట్ల యుద్ధం.. గెలుపు ఓటములను స్వీకరించాలని చురక
Shoiab Akthar
Follow us on

ఆసియా కప్ (Asia cup) లో భాగంగా బుధవారం (నిన్న) జరిగిన మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ మధ్య పోరు జరిగింది. ఈ గేమ్ లో పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పాక్ పై చేయి సాధించింది.19వ ఓవర్ సమయంలో అఫ్గానిస్థాన్ బౌలర్ ఫరీద్ మాలిక్, పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో అంపైర్లు, ఆటగాళ్లు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో ప్రేక్షకులు కూడా రంగంలోకి దిగారు. తమ టీమ్ ఓడిపోవడంపై అఫ్గాన్ దేశీయులు తీవ్రంగా స్పందించారు. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఓటమిని తట్టుకోలేని అఫ్గాన్‌ అభిమానులు స్టేడియంలోని కుర్చీలను విరగ్గొట్టారు. అంతటితో ఆగకుండా వాటిని పాక్‌ అభిమానుల పైకి విసిరేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను (Video) పాక్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌లో షేర్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇది ఒక గేమ్‌. క్రీడా స్ఫూర్తితో ఆడాలి. గెలుపోటములను స్వీకరించాలి. ఆటలో ఎదగాలనుకుంటే ఆటగాళ్లు, అభిమానులు కొన్ని విషయాలు తప్పక నేర్చుకోవాలి. అంటూ అఫ్గాన్‌ టీమ్‌పై అక్తర్‌ మండిపడ్డాడు. ఈ ట్వీట్ ను అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు మాజీ CEO షఫీక్ స్టానిక్‌జాయ్‌కు ట్యాగ్‌ చేశాడు. దీనిపై షఫీక్‌ కూడా అంతే దీటుగా బదులిచ్చాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కబీర్‌ ఖాన్‌, ఇంజిమామ్‌, రషీద్‌ లతిఫ్‌లను అడగండి మేం వారితో ఎలా ప్రవర్తించామోనని సమాధానమిచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ మ్యాచ్‌లో పాక్‌ విజయంతో ఆసియా కప్‌లో భారత్‌ కథ ముగిసింది. ఇప్పటికే రెండు వరుస ఓటములతో ఉన్న భారత్‌ గురువారం అఫ్గాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టోర్నమెంట్ ను ముగించాలని రోహిత్ సేన భావిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి