Frederique Overdijk: ఒక బౌలర్ నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, అందులో ఏడు వికెట్లు తీస్తే కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. ప్రపంచ రికార్డుతో బ్యాట్స్‌మెన్లను భయపెట్టిన ఆ మాహిళా బౌలర్.. ఆగస్టు 26 న ఈ రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్ ఓవర్‌డిక్ కేవలం మూడు పరుగులకే ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చింది. ఈ మహిళా ప్లేయర్ తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు మెయిడిన్లు కూడా వేయడం విశేషం. క్రికెట్‌లో ఇంతకు ముందు ఏ ఆటగాడు ఇలాంటి ఫీట్ సాధించలేకపోయాడు. పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్ అయినా, టీ 20 క్రికెట్‌లో కేవలం ఆరు వికెట్లకు మించి ఎవరూ పడగొట్టలేకపోయారు. ఫ్రెడెరిక్ ఓవర్‌డిక్ బౌలింగ్ ముందు ఫ్రాన్స్ జట్టు మొత్తం 33 పరుగులకు చేతులెత్తేసింది. ఈ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ కేవలం 3.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సాధించింది. యూరోప్ రీజియన్‌లో భాగంగా ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో జరిగింది.
పేకమేడలా కుప్ప కూలింది..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఫ్రాన్స్ మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫ్రాన్స్ జట్టు.. నాలుగు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత వికెట్ల పతనం ప్రారంభమైంది. పేకముక్కల్లా పెవిలియన్ చేరడం మొదలైంది. మొదటి రెండు వికెట్ల తర్వాత, ఫ్రెడరిక్ ఓవర్‌డిక్ మాత్రమే వికెట్-టేకర్‌గా మారిపోయింది. వికెట్ల సునామీతో చెలరేగి.. ఏ బ్యాట్స్‌మెన్ కుదురుకోనివ్వకుండా చేసింది. ఫ్రాన్స్ నుంచి ఏ బ్యాట్స్‌మన్ కూడా రెండంకెల సంఖ్యను దాటకపోవడం గమనార్హం.
నెదర్లాండ్స్ 21 బంతుల్లోనే..
ఎంసీ గోనీ మాత్రమే అత్యధికంగా ఎనిమిది పరుగులు చేసింది. జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఫ్రెడరిక్ ఓవర్‌డెక్ నాలుగు ఓవర్లలో 24 బంతుల్లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. కానీ, వీటిలో ఏవీ బ్యాట్ నుంచి మాత్రం రాకపోవడం విశేషం. ఇన్ని పరుగులు కేవలం వైడ్‌ల ద్వారా వచ్చాయి. 14 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి. ఇవి కూడా రాకుంటే ఫ్రాన్స్ పరిస్థితి దారుణంగా ఉండేది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ మూడో బంతికి కెప్టెన్ హీథర్ సీజర్స్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. రాబిన్ రికే (21), బాబెట్ లీ లీడ్ (10) విజయాన్ని పూర్తి చేశారు. నెదర్లాండ్స్ 3.3 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన మ్యాచ్ జరిగింది.
? INNINGS BREAK
En dat was het – een innings met een wereldrecord voor Frédérique Overdijk die 7 wickets neemt.
Over een aantal minuten zijn we terug. Target: 34 runs.
Volg alles live ➡️ https://t.co/ORUc4BKn0G#FRAvNED #CricketNL #ICCT20WCEQ #T20WorldCup pic.twitter.com/SNCzrlAaW5
— Cricket?Netherlands (@KNCBcricket) August 26, 2021
?? WORLD RECORD BROKEN!!!
The Netherlands’ Frederique Overdijk has figures of 4-2-3-7 WICKETS against France ?
These are the best bowling figures in T20I history, counting both men’s and women’s cricket!
Amazing achievement ???
? @KNCBcricket #Cricket pic.twitter.com/vPgQtQYeBZ
— All Over Cricket (@AllOverCric) August 26, 2021
Also Read: Zainab Abbas: సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్ అబ్బాస్.. ఏం జరుగుతోంది..?
IPL 2021: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కి కొత్త జోష్.. 9 మంది ప్లేయర్లు అరంగేట్రం.. వారెవరంటే?