Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్‌ ఫెడరేషన్‌పై గుర్రుగా ఉన్న భారత కుస్తీవీరులు.. కారణమేంటంటే

|

Jul 28, 2022 | 2:38 PM

Commonwealth Games 2026: రాబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి షూటింగ్‌, రెజ్లింగ్‌ ఈవెంట్లను తొలగించారు. అదేవిధంగా ఆర్చరీ (విలువిద్య)ను చేర్చలేదు. దీంతో భారత అథ్లెట్లు గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే రెజ్లింగ్‌ భారత్‌ అత్యద్భుత ప్రదర్శన చేస్తోంది. షూటింగ్‌లోనూ పతకాలు వస్తున్నాయి.

Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్‌ ఫెడరేషన్‌పై గుర్రుగా ఉన్న భారత కుస్తీవీరులు.. కారణమేంటంటే
Commonwealth Games 2026
Follow us on

Commonwealth Games 2026: రాబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి షూటింగ్‌, రెజ్లింగ్‌ ఈవెంట్లను తొలగించారు. అదేవిధంగా ఆర్చరీ (విలువిద్య)ను చేర్చలేదు. దీంతో భారత అథ్లెట్లు గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే రెజ్లింగ్‌ భారత్‌ అత్యద్భుత ప్రదర్శన చేస్తోంది. షూటింగ్‌లోనూ పతకాలు వస్తున్నాయి. కాగా 2026లో కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభ వేడుకలు జరుగుతాయని ప్రకటించింది. CGF, కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా (CGAUS), విక్టోరియా రాష్ట్రం మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీటింగ్ సందర్భంగా ఈ ప్రకటన చేశాయి. 2026 ఈ టోర్నమెంట్ నిర్వహణలో నాలుగేళ్లు మిగిలి ఉన్నాయి. అయితే అంతకుముందే షూటింగ్, రెజ్లింగ్ వంటి క్రీడలను చేర్చలేదు. విలువిద్య పేరు కూడా ఈ జాబితా నుంచి తొలగించారు. దీంతో భారత క్రీడాకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..

ఇవి కూడా చదవండి

CGF నిర్ణయంపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ కున్వర్ సుల్తాన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘వరుసగా రెండవ సీజన్‌కు కామన్వెల్త్ నుంచి షూటింగ్‌ను తొలగించడం నిరాశాజనక, పూర్తిగా అస్థిరమైన నిర్ణయం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంత పెద్ద క్రీడా ఈవెంట్‌కు సిద్ధమవుతున్న షూటర్లకు ఇది చాలా అన్యాయమైన నిర్ణయం. 2026 గేమ్స్‌లో చేర్చడానికి వీలుగా, CGFలో సంబంధిత అధికారులతో ఈ విషయాన్ని తీసుకోవాలని నేను భారత ప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం (IOA)ని అభ్యర్థిస్తున్నాన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారి మాట్లాడుతూ, ‘ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం, IOA నుంచి సమష్టి కృషి అవసరం. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ దాని సముచిత స్థానాన్ని పొందేలా చేయడానికి ఏదైనా చేయాల్సి ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

హర్యానా కుస్తీవీరులకు పెద్ద దెబ్బ..
ఇదిలా ఉంటే కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌ను మినహాయించడం ముఖ్యంగా హర్యానా రెజ్లర్లకు పెద్ద దెబ్బగా మారింది. ఈ నిర్ణయంతో రెజ్లర్లు, వారి కోచ్‌లు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రెజ్లింగ్‌ క్రీడ హర్యానాకు గర్వకారణమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కూడా రెజ్లింగ్‌ను మినహాయించే నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా గర్వించదగ్గ రెజ్లింగ్, ఆర్చరీని కామన్వెల్త్ గేమ్స్ నుంచి మినహాయించడం దురదృష్టకరమని విజ్ ట్వీట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ దీనిపై పునరాలోచించాలని కోరారు.

భారత్ నుంచి గొప్ప ప్రదర్శన..
2018 గేమ్స్‌లో భారత రెజ్లర్లు ఐదు స్వర్ణాలతో సహా 12 పతకాలు సాధించారు. అదే సమయంలో దేశానికి చెందిన షూటర్లు ఏడు స్వర్ణాలతో సహా 16 పతకాలు సాధించారు. విలువిద్య విషయానికొస్తే 2010 తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కించుకోలేదు. 2010లో న్యూఢిల్లీలో జరిగిన క్రీడల్లో ఆర్చరీ ఈవెంట్లలో భారత్ మూడు స్వర్ణాలతో సహా ఎనిమిది పతకాలు సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..