CWG 2022: ఫైనల్ చేరిన పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం చేసిన తెలుగు తేజం..

|

Aug 07, 2022 | 3:43 PM

కామన్వెల్త్ గేమ్స్ 2022లో పీవీ సింధు పతకం ఖాయమైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సెమీ ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన జియా మిన్‌ను ఓడించింది.

CWG 2022: ఫైనల్ చేరిన పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం చేసిన తెలుగు తేజం..
Cwg 2022 Pv Sindhu
Follow us on

కామన్వెల్త్ గేమ్స్ 2022లో పీవీ సింధు పతకం ఖాయమైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సెమీ ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన జియా మిన్‌ను ఓడించింది. తొలి గేమ్‌లో సింగపూర్‌ క్రీడాకారిణి నుంచి భారత స్టార్‌కి గట్టి సవాలు ఎదురైనప్పటికీ, సింధు తన అనుభవాన్ని చక్కగా ఉపయోగించి తొలి గేమ్‌ను 21-19తో, రెండో గేమ్‌ను 21-17తో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది.

సెమీ ఫైనల్స్‌కు కూడా చేరేందుకు సింధు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. క్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన గో వీ జిన్‌ను ఓడించింది. గోహ్ 60వ ర్యాంక్‌లో ఉన్న క్రీడాకారిణి సింధుకు చెమటలు పట్టించింది. సింధు 19-21, 21-14, 21-18 తేడాతో విజయం సాధించింది.