కామన్వెల్త్ గేమ్స్ 2022 ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌పై భారత ఆటగాళ్లతోపాటు అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. అంపైర్ మోసం చేసిందని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ట్విటర్‌లో చీటింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. నిజానికి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పూర్తి సమయం వరకు ఇరు జట్లు సమంగా నిలిచాయి. దీని తర్వాత పెనాల్టీ షూటౌట్‌తో మ్యాచ్‌ని నిర్ణయించాల్సి ఉండగా.. ఇక్కడ భారత జట్టు అధికారిక తప్పిదంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
తొలి పెనాల్టీ షూటౌట్‌ను టీమిండియా కెప్టెన్, గోల్‌కీపర్ సవితా పూనియా కాపాడింది. ఇది జరిగిన వెంటనే షాట్ సమయంలో గడియారం ప్రారంభం కాలేదని రెఫరీ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. తద్వారా ఆస్ట్రేలియాకు మళ్లీ తొలి షాట్ కొట్టే అవకాశం పొందింది. దీంతో మ్యాచ్ గమనమే మారిపోయింది. దీని తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. కాగా ఆస్ట్రేలియా మూడు ప్రయత్నాల్లో మూడు గోల్స్ చేసింది. సెమీ ఫైనల్స్ నుంచి టీమిండియా నిష్క్రమించిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
— Guess Karo (@KuchNahiUkhada) August 6, 2022
Literally can’t see them like this. They gave their 100%. All their hardwork goes in vain bcoz of mismanagement.??#INDvsAUS #hockey #CommonwealthGames22 #unfair #cheating pic.twitter.com/kC0krsVoG8
— Gaurav Daga (@Gauravdaga29) August 5, 2022
అంతర్జాతీయ వేదికపై అదికూడా ఓ సెమీఫైనల్ మ్యాచ్ జరగుతున్నట్లు గుర్తించకపోవడం ఏంటని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడియారం మిస్టేక్ అని అంపైర్ చెప్పడం టూమచ్‌గా ఉందని నెట్టింట్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వగ్ తీవ్రంగా స్పందించాడు. ఆట ఏదైనా అంపైర్ మాత్రం తమ సూపర్ పవర్‌తో ఇలాంటి తప్పిదాలు చేస్తుంటారు. క్రికెట్‌లోనూ ఇలాంటివి జరిగేవి. అమ్మాయిలు మీరు బాగా ఆడారు. ఓడిపోయినా పర్లేదు, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.