మహిళా సెలక్షన్​ ప్యానెల్​కు ఛైర్మన్​గా నీతూ డేవిడ్

|

Sep 26, 2020 | 10:56 PM

భారత మాజీ మహిళా క్రికెటర్​ నీతూ డేవిడ్​ కీలక బాధ్యతలు అందుకున్నారు. ఇండియా విమెన్ సెలక్షన్​ కమిటీ ప్యానెల్​కు ఛైర్మన్​గా ఆమె ఎంపికయ్యారు.

మహిళా సెలక్షన్​ ప్యానెల్​కు ఛైర్మన్​గా నీతూ డేవిడ్
Follow us on

భారత మాజీ మహిళా క్రికెటర్​ నీతూ డేవిడ్​ కీలక బాధ్యతలు అందుకున్నారు. ఇండియా విమెన్ సెలక్షన్​ కమిటీ ప్యానెల్​కు ఛైర్మన్​గా ఆమె ఎంపికయ్యారు. ఇది అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్యానెల్​లో నీతూతో కలిపి మరో నలుగురు మాజీ మహిళా క్రికెటర్లు మితూ ముఖర్జీ, ఆర్తి వైద్య, రేను మార్​గ్రెట్​, వి. కల్పన ఉన్నారు. కెరీర్​లో పది టెస్టులాడిన నీతు.. 41 వికెట్లు తీసి 25 రన్స్ చేసింది. 97 వన్డేల్లో 141 వికెట్లు తీసి 74 పరుగులు చేసింది. అద్బుతమైనన బౌలర్​గా పేరు గాంచిన ఈమె.. 2008లో క్రికెట్ కు వీడ్కోలు చెప్పింది.

Also Read :

ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు

సాయానికి కృతజ్ఞత, చిన్నారికి ప్రభుత్వాధికారి పేరు