ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సూపర్-300లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన చొయరున్నీసాపై 21-14, 21-9 తేడాతో సింధు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక రెండో రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన నిట్‌చావోన్ జిందాపోల్‌ను ఢీకొననుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆరో సీడ్‌లో బరిలోకి దిగిన సమీర్ వర్మ, మలేషియాకు చెందిన లీ జీ జియాను 21-15, 16-21, 21-12 తేడాతో ఓడించాడు. రెండో […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:36 pm, Thu, 6 June 19
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సూపర్-300లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన చొయరున్నీసాపై 21-14, 21-9 తేడాతో సింధు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక రెండో రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన నిట్‌చావోన్ జిందాపోల్‌ను ఢీకొననుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆరో సీడ్‌లో బరిలోకి దిగిన సమీర్ వర్మ, మలేషియాకు చెందిన లీ జీ జియాను 21-15, 16-21, 21-12 తేడాతో ఓడించాడు. రెండో రౌండ్‌లో అతడు చైనీస్ తాపైకు చెందిన వాంగ్ జు వెయ్‌తో తలపడనున్నాడు. ఇక సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అయితే మహిళల డబుల్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అవ్వని పొన్నప్ప- ఎన్ సిక్కి రెడ్డి జోడి 14-21, 13-21 తేడాతో కొరియన్ జోడిబేక్ హానా- కిమ్ హ్యై రిన్‌ల చేతిలో ఓడిపోయింది.