India Target 407: ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్… భారత్ ముందు భారీ లక్ష్యం…

| Edited By:

Jan 10, 2021 | 11:01 AM

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 312/6 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. భారత్‌ ముందు 407 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, గ్రీన్‌(84)...

India Target 407: ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్... భారత్ ముందు భారీ లక్ష్యం...
Follow us on

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 312/6 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. భారత్‌ ముందు 407 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, గ్రీన్‌(84) ఔటయ్యాక కెప్టెన్‌ టిమ్‌పైన్‌(39) ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశారు. ఇక ఆదివారం 103/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి 182/4తో నిలిచింది. రెండో సెషన్‌లోనూ రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో లబుషేన్‌(73), మాథ్యూవేడ్‌(4) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆపై స్మిత్‌, గ్రీన్‌ ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 

ఈ క్రమంలోనే భోజన విరామం తర్వాత స్మిత్‌(81) అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. అప్పటికి ఆసీస్‌ స్కోర్‌ 208/5గా నమోదైంది. గ్రీన్‌, పైన్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు 312/6 చేరింది. గ్రీన్ ఔట్ కావడంతో పైన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. దీంతో 407 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదించాల్సి ఉంది.

 

Also Read: R Ashwin: ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్… స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన స్పిన్నర్ అశ్విన్… స్కోర్ 252/5