సాండ్‌విచ్‌ తెచ్చిన తంటా.. ఆసీస్ కోచ్‌, ఆటగాడి మధ్య తారస్థాయికి చేరుకున్న యుద్ధం.. అసలేం జరిగిందంటే.!

|

Feb 02, 2021 | 9:39 PM

Sandwich Incident: టీమిండియాతో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ యువ ఆటగాడు మార్కస్ లబూషన్‌‌‌, ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మధ్య వివాదం...

సాండ్‌విచ్‌ తెచ్చిన తంటా.. ఆసీస్ కోచ్‌, ఆటగాడి మధ్య తారస్థాయికి చేరుకున్న యుద్ధం.. అసలేం జరిగిందంటే.!
Follow us on

Sandwich Incident: టీమిండియాతో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ యువ ఆటగాడు మార్కస్ లబూషన్‌‌‌, ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో లబూషన్ తన జేబులో సాండ్‌విచ్‌ను తీసుకురావడంపై లాంగర్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆ జట్టు ఆటగాళ్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్‌ మాస్టర్‌లాగా ప్రవర్తిస్తున్నాడని.. తమ వల్ల కావట్లేదని వ్యాఖ్యలు చేశారు. అటు సిడ్నీ హెరాల్డ్ పత్రిక సైతం లాంగర్ వల్ల జట్టులో విబేధాలు తలెత్తాయని ఓ ఆర్టికల్‌ను సైతం ప్రచురించింది. అయితే దీనిపై తాజాగా లాంగర్ స్పందిస్తూ.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. ఇంతటితో అయిపోయిందని అనుకుంటే తాజాగా మరోసారి లబూషన్ కీలక వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరలేపాడు.

”మ్యాచ్ జరిగేటప్పుడు లబూషన్‌ను సాండ్‌విచ్ తినొద్దని మాత్రమే చెప్పాను. అందుకు కారణం కూడా ఉంది. లంచ్ బ్రేక్ దాదాపు 40 నిమిషాల పాటు ఇచ్చారు. ఆ సమయంలో సాండ్‌విచ్ తినకుండా మైదానంలోకి తన జేబులో సాండ్‌విచ్ ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించాను. ఎందుకంటే కోచ్‌గా నా జట్టు అత్యున్నత స్థానంలో ఉండాలని ఆశిస్తా.. అందుకు కాస్త క్రమశిక్షణగా ఉండొచ్చు. అంతమాత్రానా కొందరు ఆటగాళ్లు నాపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత ఆటగాళ్లు ఎవరూ కూడా మైదానంలోకి ఏ వస్తువును తీసుకురాకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆ నిబంధననే లబూషన్‌కు వర్తింపజేశాను.” అని లాంగర్ పేర్కొన్నాడు.

Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..