Ngangom Dingko Singh: ఏషియ‌న్ గేమ్స్ గోల్డ్ మెడ‌లిస్ట్ బాక్సర్.. నాంగోమ్ డింగ్‌కో సింగ్ కన్నుమూత..

|

Jun 10, 2021 | 12:21 PM

Boxer Ngangom Dingko Singh: భారత బాక్స‌ర్ నాంగోమ్ డింగ్‌కో సింగ్ గురువారం కన్నుమూశారు. 1998 ఏషియ‌న్ గేమ్స్‌లో బాంట‌మ్‌ వెయిట్ కేట‌గిరీలో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన నాంగోమ్

Ngangom Dingko Singh: ఏషియ‌న్ గేమ్స్ గోల్డ్ మెడ‌లిస్ట్ బాక్సర్.. నాంగోమ్ డింగ్‌కో సింగ్ కన్నుమూత..
Ngangom Dingko Singh
Follow us on

Boxer Ngangom Dingko Singh: భారత బాక్స‌ర్ నాంగోమ్ డింగ్‌కో సింగ్ గురువారం కన్నుమూశారు. 1998 ఏషియ‌న్ గేమ్స్‌లో బాంట‌మ్‌ వెయిట్ కేట‌గిరీలో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన నాంగోమ్ డింగ్‌కో సింగ్ గత కొంతకాలంగా పలు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. 2017లో లివ‌ర్ క్యాన్స‌ర్ బారిన ప‌డి చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మణిపూర్ ఇంఫాల్‌లో నివసిస్తున్నారు. అయితే.. 2020లో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బైల‌రీ సైన్సెస్‌లో రేడియేష‌న్ థెర‌పీ సైతం తీసుకున్నారు. దీంతోపాటు క‌రోనా బారిన ప‌డి కూడా కోలుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో డింగ్‌కోకు మ‌రోసారి ఆరోగ్యం విష‌మించ‌డంతో మళ్లీ ఢిల్లీలోని ఐఎల్‌బీఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయనకు కామెర్లు కూడా ఉన్న‌ట్లు వైద్యులు నిర్దారించారు. పలు వ్యాధులతో పోరాడి నిలిచిన డింగ్‌కో గురువారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1998లో సర్ణ పతకం సాధించిన అనంతరం భార‌త ప్ర‌భుత్వం.. నాంగోమ్ డింగ్‌కో సింగ్‌కు అదే ఏడాది అర్జున‌, 2013లో ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను ప్ర‌దానం చేసింది. బాక్సింగ్ అనంతరం డింగ్‌కో ఇండియ‌న్ నేవీకి కూడా సేవ‌లందించారు. అనారోగ్యం బారిన ప‌డ‌క ముందు బాక్సింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు. డింగ్‌కో మ‌ర‌ణంపై బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ స్పందించాడు. ట్విట‌ర్‌లో అత‌నికి నివాళుల‌ర్పిస్తూ సందేశాన్ని పోస్ట్ చేశారు. అత‌ని జీవితం, పోరాటం రాబోయే ఎన్నో త‌రాల‌కు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తుంద‌ని విజేంద‌ర్ అన్నాడు.

Also Read:

Covid Children: పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వద్దు, తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయిడ్స్.. కరోనా చికిత్సపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం.. కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే ఉద్యోగికి 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్!