సగర్వంగా సెమీస్‌లోకి.. ఆసియా క్రీడల్లో జపాన్‌పై భారత మహిళల హాకీ జట్టు అద్భుత విజయం!

ఆసియా క్రీడలు 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. పూల్-బి మ్యాచ్‌లో జపాన్‌పై 3-1 గోల్స్ తేడాతో విజయభేరి మోగించింది. ఇక ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకొచ్చిన భారత జట్టు సెమీఫైనల్లో తన స్థానాన్ని సైతం ఖరారు చేసుకుంది.

సగర్వంగా సెమీస్‌లోకి.. ఆసియా క్రీడల్లో జపాన్‌పై భారత మహిళల హాకీ జట్టు అద్భుత విజయం!
Indian Women's Hockey Team Defeats Japan

Updated on: Sep 25, 2026 | 7:06 PM

ఆసియా క్రీడల్లో భారత మహిళ హాకీ జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న జట్టు తాజాగా గురువారం జరిగిన పూల్-బి మ్యాచ్‌లో జపాన్‌పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించించి సెమీఫైనల్‌లో భారత్ తన స్థానం ఖరారు చేసుకుంది.

మ్యాచ్‌ స్టార్ట్ అయిన తొలి క్వార్టర్‌లో లాల్‌రెమ్సియామి ఓపెన్ ప్లే ద్వారా తొలి గోల్ కొట్టగా, రెండో క్వార్టర్ చివర్లో ఇషికా మరో గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని పెంచుకొచ్చింది. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి భారత్ స్కోర్ 2-0తో జపాన్‌పై ఆధిక్యంలో నిలిచింది. అంతేకాదు.. ప్రత్యర్తి జట్టు తమపై ఎక్కవ స్కోర్ చేయకుండా అడ్డుకోవడంతో కూడా భారత మహిళల జట్టు చాకచక్యంగా అడ్డుకట్టవేసింది.

అయితే ఫస్ట్‌ ఆఫ్‌లో భారత్‌ ఎక్కువ గోల్స్ కొట్టకుండా ప్రత్యర్థి జట్టు బాగానే అడ్డుకున్నప్పటికీ.. సర్కిల్ లోపల అద్భుతమైన, పక్కా ప్రదర్శన కనబరిచిన భారత జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించి చివరకు విజయాన్ని కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us