Asia Games: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. సత్తా చాటిన హాకీ జట్టు..

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా మరో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. పురుషుల హాకీ జట్టు స్వర్ణం సాధించింది. మలేషియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5-1 తేడాతో భారత్ గెలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

Asia Games: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. సత్తా చాటిన హాకీ జట్టు..
India

Updated on: Oct 03, 2026 | 5:48 PM

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల హాకీ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో మలేషియాపై భారత్ విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మలేసియాపై 5-1తో భారత పురుషుల హకీ జట్టు గెలపొందింది. దీంతో ఈ క్రీడల్లో ఇప్పటివరకు భారత స్వర్ణ పతకాల సంఖ్య 21కు చేరుకుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. చరిత్రలో తొలిసారిగా తమ ఆసియా టైటిల్‌ను భారత్ విజయవంతంగా నిలబెట్టుకుంది. ఈ విజయంతో భారతదేశం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.  తాజా గోల్డ్ మోడల్‌తో కలిసి ఆసియా క్రీడల్లో హాకీలో ఇప్పటివరకు భారత్ ఐదో బంగారం పతకాలు సాధించినట్లయింది.

2026 ఎడిషన్‌లోనే తొలిసారిగా భారత పురుషుల, మహిళల జట్లు రెండూ కలిసి స్వర్ణం సాధించాయి. అంతకుముందు మహిళల హాకీ జట్టు చైనాను ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది.  44 ఏళ్లలో మహిళల జట్టు  తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.  ఈ విజయాలతో భారత హాకీ ప్రస్థానం ఒక మైలురాయిగా నిలిచింది. ఒకే క్రీడల్లో ఇరు జట్లు అత్యున్నత పతకాలతో స్వదేశానికి తిరిగి రావడం చరిత్రలో ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు.

హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్‌ను సెమీఫైనల్‌లో 4-3 తేడాతో ఓడించి ఫైనల్ పోరుకు చేరుకుంది. మలేషియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా గెలిచి గోల్డ్ మోడల్ సొంతం చేసుకుంది.  ఈ చారిత్రాత్మక విజయంపై ఇండియా హాకీ అసోసియేషన్ ఎక్స్‌లో తన ఆనందాన్ని పంచుకుంది. ఆసియా గేమ్స్‌లో భారత్ హాకీ జట్టు మరోసారి ఛాంపియన్‌గా నిలిచిందని, వరుసగా గోల్డ్ మెడళ్లు సాధించి చరిత్ర సృష్టించిందని పేర్కొంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us