Cricket: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ కు టీమిండియా హెడ్ కోచ్ గా హైదరాబాదీ..

|

Aug 24, 2022 | 9:16 PM

మరికొద్దిరోజులు కీలక మైన ఆసియా కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నీర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా పాజిటివ్ కారణంగా చికిత్స తీసుకుంటుండంతో ఆసియా కప్ వరకు..

Cricket: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ కు టీమిండియా హెడ్ కోచ్ గా హైదరాబాదీ..
Vvs Laxman
Follow us on

Cricket: మరికొద్దిరోజులు కీలక మైన ఆసియా కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నీర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా పాజిటివ్ కారణంగా చికిత్స తీసుకుంటుండంతో ఆసియా కప్ వరకు భారత క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతలు హైదరాబాద్ కు చెందిన వివిఎస్.లక్ష్మణ్ ను నియమించింది. ఆసియా కప్ టోర్ని ముగిసేవరకు లక్ష్మణ్ కోచ్ గా ఉంటారని బీసీసీఐ ప్రకటించింది. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత బృందంలో చేరతారని వెల్లడించింది. ప్రస్తుతం వివిఎస్.లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) అధ్యక్షుడిగా ఉన్నారు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ కు కూడా వివిఎస్.లక్ష్మణ్ ప్రధాన కోచ్ గా వ్యవహరించారు. ఈసిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

UAE వేదికగా ఈనెల 27వ తేదీ నుంచి ఆసియా కప్ మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల భారత జట్టును ఇప్పటికే ఆసియా కప్ కోసం బీసీసీఐ ప్రకటించింది. ఈజట్టకు వైస్ కెప్టెన్ గా కె.ఎల్.రాహుల్ ను నియమించింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ లకు జట్టులో స్థానం కల్పించింది. కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, మహ్మద్ షమీలు ఈమెగా టోర్నికి దూరమయ్యారు. ఆసియాకప్ భారత్ తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..