ఆర్మీలో ఇక ధోని కెరీర్

| Edited By:

Jul 22, 2019 | 1:00 PM

తాను ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నానంటూ మాజీ కెప్టెన్, టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోని చేసుకున్న దరఖాస్తుకు ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్‌లో రెండు నెలల పాటు ధోని శిక్షణ తీసుకోనున్నాడు. ఈ శిక్షణ కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆర్మీలో జరిగే ఆపరేషన్‌లలో […]

ఆర్మీలో ఇక ధోని కెరీర్
Follow us on

తాను ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నానంటూ మాజీ కెప్టెన్, టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోని చేసుకున్న దరఖాస్తుకు ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్‌లో రెండు నెలల పాటు ధోని శిక్షణ తీసుకోనున్నాడు. ఈ శిక్షణ కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆర్మీలో జరిగే ఆపరేషన్‌లలో మాత్రం ధోని పాల్గొనరు.

కాగావెస్టిండీస్ పర్యటన నుంచి స్వయంగా తప్పుకున్న ధోని.. గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో రెండు నెలల పాటు పారామిలిటరీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆర్మీలో పనిచేసేందుకు ఆయన ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా 2011లో భారత ఆర్మీ ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2015లో ఆగ్రాలో పారా రెజిమెంట్‌లోనూ ధోని ఓసారి శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.