India Vs Australia 2020: జాత్యహంకార దూషణలపై తీవ్రంగా స్పందించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..

|

Jan 10, 2021 | 6:03 PM

India Vs Australia 2020: సిడ్నీ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌పై ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు జాత్యహంకార దూషణలు..

India Vs Australia 2020: జాత్యహంకార దూషణలపై తీవ్రంగా స్పందించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..
Follow us on

India Vs Australia 2020: సిడ్నీ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌పై ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు జాత్యహంకార దూషణలు చేయడంపై విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు. సిడ్నీ టెస్ట్ సందర్భంగా ఆదేశ ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలు.. వారి జాత్యహంకారానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో విచారకరం అన్నారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, తాను సైతం జాత్యహంకార కామెంట్స్ ఎదుర్కొన్నానని కోహ్లీ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు పూర్తిగా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ విరాట్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు.

కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. కొందరు ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ‘బ్రౌన్ డాగ్,  బిగ్ మంకీ’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన మహ్మద్ సిరాజ్.. అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దాంతో వెంటనే స్పందించిన స్టేడియం భద్రతా సిబ్బంది.. సదరు వ్యాఖ్యలు చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అదే సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. కాగా, ఆస్ట్రేలియన్ ప్రేక్షకుల జాత్యహంకార వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. మరోవైపు.. ఐసీసీ సైతం దీనిపై స్పందించింది. జాత్యహంకార వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను వివరణ కోరింది.

Also read:

ఐపీఎల్ 2021 మినీ వేలం.. చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టే ప్లేయర్స్ జాబితా ఇదే.!

India Vs Australia 2020: గెలవాలంటే… భారత్‌కు 309 పరుగులు.. ఆసీస్‌కు 8 వికెట్లు… విజయం ఎవరిని వరించునో

 

Virat Kohli Tweet: