Kolkata Knight Riders : కోల్‌కతా సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లను నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ వద్దనుకుంటుందా.?

|

Jan 17, 2021 | 5:23 PM

ఐపీల్2021 ‌కు ఇటు బీసీసీఐ, అటు ఫ్రాంఛైజీలు కసరత్తులు మొదలు పెట్టాయి. త్వరలోనే ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం త్వరలో ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

Kolkata Knight Riders : కోల్‌కతా సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లను నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ వద్దనుకుంటుందా.?
Follow us on

Kolkata Knight Riders : ఐపీల్2021 ‌కు ఇటు బీసీసీఐ, అటు ఫ్రాంఛైజీలు కసరత్తులు మొదలు పెట్టాయి. త్వరలోనే ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం త్వరలో ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమకు వద్దనుకున్న ఆటగాళ్ల జబితాను ఇవ్వాలని బీసీసీఐ కోరనుంది. అయితే ఈ సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ప్రదర్శన చేయలేకపోయిన ఆటగాళ్లను వదులుకోవాలని నిర్ణయించింది. ఈ లిస్ట్ లో దినేశ్‌ కార్తీక్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. గత సీజన్ మధ్యలో దినేశ్‌ కార్తీక్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌ కేవలం 169 పరుగులే చేశాడు. దినేష్ ను 7.4కోట్లతో కొనుగోలు చేసింది కోల్‌కతా. అయితే దినేష్ తోపాటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌(5.8 కోట్లు)ను ఫ్రాంఛైజీ విడి పెట్టాలనుకుంటుందట. వీళ్లతో పాటు స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌(15.5కోట్లు), ఆండ్రీ రస్సెల్‌(8.5కోట్లు), సునీల్‌ నరైన్‌(12.5కోట్లు), క్రిస్‌ గ్రీన్‌(రూ.20లక్షలు)లను  ఉంచాలా వాడుకుకోవాలా అని ఫ్రాంఛైజీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.