ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్ దుమ్మురేపుతున్నారు. 72 ఏళ్ల ఆసియా క్రీడా చరిత్రలో అరుదైన ఘనతను సాధించారు. చైనాలోని హంగ్జూ వేదికగా జరుగుతోన్న 19వ ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్ పతకాల పంటను పండిస్తున్నారు. ఈసారి భారత ప్లేయర్స్ ఏకంగా 100 పతకాలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 70 పతకాలు సాధించగా ఇప్పుడు సెంచరీ కొట్టేశారు.
భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ప్రధాని.. ప్లేయర్స్‌ను ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత విజయం సాధించిందని తెలిపిన ప్రధాని, భారత్ 100 పతకాల మైలు రాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్ ఈ చారిత్రాత్మక మైలురాయిను సాధించడానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
క్రీడాకారుల అద్భుత ప్రదర్శన విస్మయం కలిగించడమే కాకుండా, దేశ ప్రజల హృదయాలను గర్వంతో నింపిందని ప్రధాని అభివర్ణించారు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని కలవనున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని.. దేశ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులతో మాట్లాడడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
A momentous achievement for India at the Asian Games!
The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.
I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA
— Narendra Modi (@narendramodi) October 7, 2023
ఇదిలా ఉంటే ఆసియా క్రీడా చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాలను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే భారత్ తొలిసారి 100 పతకాలను అందుకుంది. కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించడంతో భారత్ ఈ ఘనత సాధించింది. శనివారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుది పోరులో చైనీస్ తైపీ జట్టును టీమిండియా 26-25 తేడాతో ఓడించింది. దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు బంగారు పతకాన్ని అందుకుంది. ఇక శనివారం ఒక్కరోజే భారత్ మూడు గోల్డ్ మెడల్స్‌ను అందుకోవడం విశేషం. రెండు ఆర్చరీలో, ఒకటి కబడ్డీలో వచ్చింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 25 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్ మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..