Zodiac Signs: ఈ 4 రాశుల వారు చిన్న చిన్న విషయాలకే ఆవేశపడతారు.. వీరితో చాలా జాగ్రత్త..!

Zodiac Signs: కోపం అనేది ప్రతి వ్యక్తిలో ఉండే సహజమైన భావోద్వేగం. కానీ ఏదైనా పరిమితికి మించి వెళితే అది తప్పు దారికి తీసుకెళ్తుంది.

Zodiac Signs: ఈ 4 రాశుల వారు చిన్న చిన్న విషయాలకే ఆవేశపడతారు.. వీరితో చాలా జాగ్రత్త..!
Zodia Signs

Zodiac Signs: కోపం అనేది ప్రతి వ్యక్తిలో ఉండే సహజమైన భావోద్వేగం. కానీ ఏదైనా పరిమితికి మించి వెళితే అది తప్పు దారికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా కోపం అదిపెద్ద లోపంగా పరిగణించబడుతుంది. కోపంలో ఒక వ్యక్తి తన మనస్సాక్షిని కోల్పోతాడు. సరైన నిర్ణయాలు తీసుకోలేడు.

కోపం కొందరిలో సహజంగానే ఉంటుంది. వ్యక్తి రాశి కారణంగా, అతని కుటుంబ వాతావరణం కారణంగా ఇది జరుగుతుందని చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం. ప్రతి రాశికి దాని స్వంత స్వభావం ఉంటుంది. ఇది ఆ రాశికి చెందిన వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. స్వతహాగా చాలా కోపంగా ఉండే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా నాలుగు రాశుల వారు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. అలాంటి వారితో గొడవ పడకపోవడమే మంచిది. మరి ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశి..
ఈ రాశికి అధిపతి కుజుడు. అంగారకుడి స్వభావం భగభగ మండుతూనే ఉంటాడు. ఈ రాశిచక్రంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఉగ్రరూపంతో ఉంటారు. వీరికి కోపం రావడానికి ఎక్కువ సమయం పట్టదు. కోపం వారి ముక్కుపై ఎప్పుడూ ఉంటుంది. వారితో వాదించడం అంటే చిన్న విషయానికి కూడా పెద్ద విషయం చేసుకోవడమే. కాబట్టి వారితో గొడవ పడకపోవడమే మంచిది.

వృషభం..
ఈ రాశికి చెందిన వారు చాలా మొండిగా ఉంటారు. అన్ని చోట్లా వారు నిలకడగా ఉండలేరు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎవరైనా తమ మాటను ధిక్కరించినా, తమకు ఎదురు చెప్పినా.. ఆగ్రహానికి గురవుతారు. ఆ సమయంలో ఎవరైనా వారితో వాదించడం మొదలు పెడితే.. వారి కోపం పీక్స్‌లోకి చేరుకుంటుంది. ఇక కోపంలో, వారు కొన్నిసార్లు తమకు తాము హాని చేసుకుంటారు. అయితే, ఆ తర్వాత వారు రియలైజ్ అవుతారు.

సింహరాశి..
సింహ రాశి వారు ఎవరి కింద ఉండేందుకు ఇష్టపడరు. అందుకే ఎవరి ఆంక్షలను వారు సహించలేరు. ఎవరైనా తమను ఏదో ఒక విషయంలో తప్పుగా పిలిస్తే పోరాటానికి సిద్ధమవుతారు. ఒక్కసారి వారి మనసులో ఏదైనా చేయాలనే తపన ఉంటే, అది పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారు ఊపిరి పీలుస్తారు. కోపం వస్తే అన్ని బంధుత్వాలు మరిచిపోయి ఏ విషయాన్నయినా డైరెక్ట్‌గా మాట్లాడేస్తారు.

తులారాశి
తుల రాశి వ్యక్తుల హృదయం పరిశుభ్రంగా ఉంటుంది కానీ, నోటి దురుసు అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఇతరుల గురించి బాగా ఆలోచిస్తారు. కానీ కోపం వచ్చినప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడతారు. వీరి మాటలు.. ఎదుటి వారిని తీవ్రంగా బాధిస్తాయి. కోపంలో, ఎదుటి వ్యక్తి తమ పట్ల ఎంత చెడుగా అనుకుంటున్నారో వారికి తెలియదు. కోపం వచ్చినప్పుడు.. ఎవరైనా వారితో ఏదైనా విషయం చెబితే, వారి కోపం నశాలానికి అంటుకుంటుంది. గొడవకు కూడా దిగుతారు. అయితే, కోపం తగ్గిన తరువాత తమ తప్పును తెలుసుకుంటారు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..

Click on your DTH Provider to Add TV9 Telugu